వెన్నెల దిగివచ్చింది

నిలువెత్తు అందం వెండిరంగు పొడవాటి గౌనేసుకొని నడిచొచ్చినట్టుగా ఉంది కదా దీపికను చూస్తుంటే! ఫోటో చూస్తేనే అలా అనిపిస్తే…ప్రత్యక్షంగా వీక్షించిన వాళ్లు కనుల పండుగ అంటున్నారు. ముంబయిలో జరిగిన ఓ పురస్కార వేడుక కోసం దీపికా పదుకొణె వెన్నెలను రాశిగా పోసినంత అందంగా ముస్తాబైంది. ఆమె వయ్యారపు నడకలు చూసి వీక్షకులు మురిసిపోయారు. దీపిక అందానికి తగ్గట్టే ఆమెను ఈ వేడుకలో ‘గ్లోబల్ బ్యూటీ స్టార్’ పురస్కారంతో సత్కరించారు. దీపిక ప్రస్తుతం మేఘనా గుల్జార్ దర్శకత్వంలో నటిస్తోంది. ఈ కార్యక్రమంలో సోనాక్షి సిన్హా, దిశాపటానీ తదితరులు సందడి చేశారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com