సింగపూర్ పర్యటనకు కేటీఆర్

రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్కు మరో అంతర్జాతీయ సదస్సుకు ఆహ్వానం అందింది. వచ్చే నెల 6, 7 తేదీల్లో సింగపూర్లో జరిగే బ్లూమ్బర్గ్ నూతన ఆర్థిక వేదిక(న్యూ ఎకానమీస్ ఫోరం) వ్యవస్థాపక ప్రతినిధిగా హాజరు కావాలని నిర్వాహకులు కోరారు. ఈ మేరకు ఆదివారం ఆయనకు లేఖ రాశారు. వివిధ దేశాల ప్రభుత్వ ప్రతినిధులు, రాజకీయ నేతలు, వక్తలు, 300 అంతర్జాతీయ కంపెనీల ముఖ్య కార్యనిర్వహణాధికారులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లపై చర్చించి, అభివృద్ధి దిశగా ముందుకెళ్లేందుకు అవసరమైన పరిష్కారాలను సూచించేందుకు సదస్సు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు వెల్లడించారు. సదస్సులో నగరీకరణ, పట్టణ మౌలిక వసతులు, ఐటీ రంగం పురోగమనం, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ప్రగతి, పరిపాలన విధానాల ద్వారా సమాజంలోని అసమానతలను అరికట్టేందుకు తీసుకున్న చర్యలపై ప్రసంగించాలని కేటీఆర్ను కోరారు. సింగపూర్ అంతర్జాతీయ సదస్సుకు సంబంధించి ఆహ్వానంఅందడంపై కేటీఆర్సంతోషం వ్యక్తం చేశారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com