మోడీపై కాలిఫోర్నియాలో కేసు

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌కు సుమారు రూ.13వేల కోట్లకుపైగా రుణాలు ఎగవేసి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ కెనడాకు చెందిన ఓ వ్యక్తికి నకిలీ వజ్రాలను అమ్మినట్లు తెలుస్తోంది. సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌ కథనం ప్రకారం.. జూన్‌ నెలలో నీరవ్‌ కెనడాకి చెందిన పౌల్‌ ఆల్ఫోన్సో అనే వ్యక్తికి హాంకాంగ్‌లో సుమారు 2లక్షల డాలర్ల(రూ.1.4కోట్లు) విలువైన రెండు డైమండ్‌ ఉంగరాలను విక్రయించాడు. అయితే.. అవి నిజమైన వజ్రాలు అనుకొని కొనుగోలు చేసిన ఆల్ఫోన్సో ఆ తర్వాత అవి నకిలీవి అని తెలుసుకున్నాడు. ఈ విషయం బయటపడటంతో ఆల్ఫోన్సో గర్‌్్ఫ్రెండ్‌ అతడికి బ్రేకప్‌ చెప్పేసింది. నీరవ్‌ పీఎన్‌బీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తనకు తెలియదని అతను చెబుతున్నాడు. ఇప్పుడు నీరవ్‌ తనను మోసం చేశాడంటూ కాలిఫోర్నియాలో కేసు పెట్టాడు.2012లో నీరవ్‌, ఆల్ఫోన్సో తొలిసారి కలుసుకున్నారు. ఆ తర్వాత తన గర్ల్‌ ఫ్రెండ్‌కు ప్రపోజ్‌ చేయాలని అందుకోసం ప్రత్యేకంగా ఓ డైమండ్‌ రింగ్‌ చేయించి ఇవ్వాలని నీరవ్‌కు ఆల్ఫోన్సో మెయిల్‌ చేశాడు. అందుకోసం లక్ష డాలర్లను నీరవ్‌కు ఇచ్చాడు. అది నచ్చడంతో తన గర్ల్‌ఫ్రెండ్‌ కోసం మరో డైమండ్‌ రింగ్‌ చేసి ఇవ్వాల్సిందిగా కోరాడు. హాంకాంగ్‌లో ఉన్న నీరవ్‌ బ్యాంక్‌ ఖాతాకు ఆల్ఫోన్స్‌ నగదు వేశాడు. ఈ ఏడాది జూన్‌లో ఈ రెండు రింగులు ఆల్ఫోన్స్‌కు చేరాయి. అయితే ఆగస్టు నెలలో నీరవ్‌ ఇచ్చిన డైమండ్స్‌ నకిలీవి అని ఆల్ఫోన్సోకు అతడి గర్ల్‌ ఫ్రెండ్‌ చెప్పింది. అదే సమయంలో నీరవ్‌ బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగవేసి విదేశాలకు పారిపోయిన విషయం కాస్తా ఆల్ఫోన్సోకు తెలిసింది. దీంతో అతడు మోసపోయిన విషయాన్ని గ్రహించాడు. ఇది జరిగిన తర్వాత ఆల్ఫోన్స్‌ కు అతడి గర్ల్‌ ఫ్రెండ్‌ బ్రేకప్‌ చెప్పింది. మోసపోయినట్లు తెలుసుకున్న ఆల్ఫోన్సో కాలిఫోర్నియాలోని కోర్టులో నీరవ్‌పై కేసు వేశాడు. తనను మోసం చేసినందుకు గాను 4.2మిలియన్‌ డాలర్లు చెల్లించాల్సిందిగా అతడు తన ఫిర్యాదులో కోరాడు. అంటే మన కరెన్సీలో సుమారు రూ.31కోట్లు.ఇటీవల నీరవ్‌కు చెందిన రూ.600కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు జప్తు చేశారు. వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన నీరవ్‌ను భారత్‌ రప్పించేందుకు అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే అతడిపై ఇంటర్‌పోల్‌ అధికారులు రెడ్‌కార్నర్‌ నోటీసులను జారీ చేశారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com