అమెరికా ఖాతాలో మరో నోబెల్

2018 సంవత్సరానికి అర్థశాస్త్రంలో అమెరికాకు చెందిన విలియం డి నోర్దాస్‌, పాల్ ఎం రోమర్‌లకు నోబెల్ పురస్కారం దక్కింది. ‘నూతన ఆవిష్కరణలు, వాతావరణం, ఆర్థిక వృద్ధి’కి సంబంధించి వారు చేసిన పరిశోధనకు గానూ ఈ అత్యున్నత పురస్కారం వరించింది. నోర్దాస్‌ ‘క్లైమెట్‌ ఎకనామిక్స్’లో, ‘ఎండోజినస్‌ గ్రోత్‌ థియరీ’ అనే అంశం మీద పాల్ రోమర్ చేసిన కృషికి ఈ అవార్డును గెలుచుకున్నారు. ‘ప్రస్తుత సమయంలో అత్యంత ప్రధానమైన అంశాలైన ‘గ్లోబల్ ఎకానమీలో దీర్ఘకాల స్థిరమైన వృద్ధి, ప్రపంచ జనాభా సంక్షేమం’ వంటి కీలకాంశాల్లో విశేషమైన పరిశోధనలు నిర్వహించారు’ అని నోబెల్ కమిటీ ఆ ద్వయాన్ని ప్రశంసించింది. వాతావరణంలో తీవ్రంగా పెరిగిపోతున్న కర్బన ఉద్గారాలను కట్టడి చేయడానికి నోర్దాస్‌ పలు సూచనలు చేశారు. అన్ని దేశాల మీద సమానంగా కార్బన్‌ పన్నులను విధించేలా అంతర్జాతీయ పథకాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. కొత్త కొత్త ఆలోచనలను ఒక దగ్గరికి చేర్చి దీర్ఘకాలిక సుస్థిర వృద్ధిని ఎలా సాధించవచ్చో రోమర్‌ పరిశోధన వెల్లడి చేసిందని నోబెల్ కమిటీ తన ట్విటర్ ఖాతాలో వెల్లడించింది. కొత్త ఆలోచనలు, నూతన ఆవిష్కరణలు వెలుగులో రావడానికి కంపెనీల సుముఖత ను ఆర్థిక శక్తులు ఎలా నియంత్రిస్తాయో రోమర్ విపులీకరించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com