పేద ప్రతిభావంతులైన విద్యార్థినీ విద్యార్థులకు అమెరికాకు చెందిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) “చేయూత” కార్యక్రమం ద్వారా ఆర్థిక సహకారాన్ని అందిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రవాసాంధ్ర ప్రముఖుడు, తానా ఫౌండేషన్ కోశాధికారి వల్లేపల్లి శశికాంత్-ప్రియాంక దంపతులు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన 40మంది పేద విద్యార్థులకు ఉపకారవేతనాలను అందజేశారు. మంగళవారం నాడు కాకినాడలోని మహర్షి సాంబమూర్తి ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో DIG మోహనరావు, తూగో జిల్లా ఎస్పీ అద్నా నయూమ్ అస్మీ, CI వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొని విద్యార్థులకు ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందజేసి తానా సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. విద్యార్థులు వల్లేపల్లి దంపతులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ అవకాశం కల్పించిన తానా అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్, ఫౌండేషన్ ఛైర్మన్ నిరంజన్లకు శశికాంత్ ధన్యవాదాలు తెలిపారు.
కాకినాడలో పేదవిద్యార్థులకు ఆర్థిక సాయమందించిన వల్లేపల్లి శశికాంత్ దంపతులు
Related tags :