వైరాముత్తు ముద్దులు

‘మీటూ’ ఉద్యమం భారత్‌లో ఓ ఉప్పెనలా ఎగసిపడుతోంది. బాలీవుడ్‌ నటి తనుశ్రీ దత్తా తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి చెప్పిన తర్వాత అనేక మంది నటీమణులు, ఆర్టిస్టులు తమ చేదు అనుభవాల్ని ధైర్యంగా బయటపెడుతున్నారు. నానా పటేకర్‌ నుంచి రజత్‌ కపూర్‌, వికాస్‌ బెహెల్‌, చేతన్‌ భగత్‌ తదితరుల పేర్లు బయటపడ్డాయి. తాజాగా తనతో ప్రముఖ సాహిత్య రచయిత వైరాముత్తు అసభ్యంగా ప్రవర్తించాడని ఓ గాయని తెలిపారు. చాలా ఏళ్ల క్రితం ఇది జరిగిందని అన్నారు. ఆ రోజు తన జీవితంలోనే అతి నీచమైన రోజని ఆవేదన వ్యక్తం చేశారు. వైరాముత్తు మహిళల పట్ల తప్పుగా ప్రవర్తిస్తారని తెలిసినా ఎవరూ ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడటానికి ధైర్యం చేయలేదని.. దానికి ఆయనకున్న రాజకీయ బలమే కారణమని సదరు గాయని పేర్కొన్నారు. ఆమె తనకు ఎదురైన వేధింపుల్ని ప్రముఖ గాయని, తన స్నేహితురాలు చిన్మయి శ్రీపాదకు వాట్సాప్‌ ద్వారా తెలిపారు. చిన్మయి ఆ సందేశాలను స్క్రీన్‌షాట్‌ తీసి ట్విటర్‌లో షేర్‌ చేశారు. ‘ఆయన (వైరాముత్తు) నా కోసం మజ్జిగ తెప్పించారు. నేను తాగుతుంటే.. నా పెదవిపై మజ్జిగ ఇంకా అలానే ఉందని అన్నాడు. బీసెంట్‌ నగర్‌లోని ఆయన ఇంటిలో ఉన్న సోఫాలో నేను కూర్చుని ఉన్నా. ఆయన నా దగ్గరికి వచ్చారు.. దాదాపు నన్ను ముద్దుపెట్టుకున్నాడు. నేను భయంతో నా ఫోన్‌, బ్యాగ్‌ తీసుకుని అక్కడి నుంచి పరుగెత్తుకుంటూ వచ్చేశా. నా స్నేహితులకు, సింగర్స్‌కు ఈ విషయం తెలుసు. నాకు ఈ ఘటన ఎదురైన తర్వాత వారిని జాగ్రత్తగా ఉండమని హెచ్చరించా. ఇది నా జీవితంలోనే అతి నీచమైన రోజు. నా భర్తకు కూడా ఇంకా ఈ విషయం తెలియదు. చెబితే ఆయన నా కెరీర్‌ను ఇక్కడితే ఆపేస్తారు.. పాడటానికి ఒప్పుకోరు’ అని బాధిత గాయని సందేశాల్లో పేర్కొన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com