ScienceAndTech

భారత్ బయోటెక్‌కు నిరాశ

భారత్ బయోటెక్‌కు నిరాశ

దేశీ దిగ్గజాలు భారత్‌ బయోటెక్‌, సీరం ఇన్‌స్టిట్యూట్‌ కరోనా వ్యాక్సిన్ల ఎమర్జెన్సీ వినియోగానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది.

వ్యాక్సిన్‌ భద్రతకు సంబంధించి పూర్తి డేటా సమర్పించనందున ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు నిపుణుల కమిటీ స్పష్టం చేసింది.

కాగా తాము అభివృద్ధి చేసిన కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ అత్యవసర వాడకానికి అనుమతి ఇవ్వాల్సిందిగా భారత్‌ బయోటెక్‌ అనుమతి కోరిన విషయం తెలిసిందే.

అదే విధంగా పూణె కేంద్రంగా పనిచేసే సీరం ఇన్‌స్టిట్యూట్‌ కూడా ఇదే తరహా ప్రతిపాదనలు చేసింది.

ఈ విషయంపై స్పందించిన సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ టీకా భద్రత అంశం గురించి మరింత డేటా అందజేయాలని ఆదేశించింది