టెన్షన్ కైకు

పద్మావత్’ సినిమా రిలీజ్ అయి పది నెలలు కావస్తున్నా ఇంకా ముఖానికి మేకప్ వేసుకోలేదు దీపికా పదుకోన్. విశాల్ భరద్వాజ్ సినిమాలో యాక్ట్ చేయాల్సి ఉన్నప్పటికీ ఇర్ఫాన్ ఖాన్ అనారోగ్యం కారణంతో ఆ సినిమా ఆగిపోయింది. మేఘన్ గుల్జర్ దర్శకత్వంలో ఓ సినిమా ఒప్పుకున్నారు. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా ప్రారంభం అవుతుందట. ఇప్పుడు మరో సినిమాకు దీపిక ‘యస్’ చెప్పినట్టు సమాచారం.లవ్ రంజన్ దర్శకత్వంలో అజయ్ దేవగన్, రణ్బీర్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కనున్న ఓ చిత్రంలో రణ్బీర్తో కలసి యాక్ట్ చేయనున్నారట. ఆల్రెడీ ఈ ఇద్దరూ ‘బచ్నా ఏ హసీనో, ఏ జవానీ హే దివానీ, తమాషా’ సినిమాల్లో కలసి నటించిన సంగతి తెలిసిందే. రణ్వీర్తో పెళ్లి తర్వాత దీపిక సెట్లోకి అడుగుపెట్టబోయేది ఈ సినిమానే అట. ఇది వరకు రణ్బీర్, దీపిక ప్రేమలో పడి విడిపోయిన సంగతి తెలిసిందే. ఆ సంగతలా ఉంచితే రణ్వీర్, దీపికల పెళ్లి నవంబర్ లేక రానున్న జనవరిలో ఉంటుందట. ప్రస్తుతానికి దీపిక ఖాళీగా ఉన్నారు కాబట్టి టెన్షన్ లేకుండా పెళ్లి పనులు చూసుకుంటున్నారట.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com