అమైరాకు నరకం

‘మీటూ’ ఉద్యమంలో నటి అమైరా దస్తూర్‌ కూడా చేరారు. ఓ సినిమా సెట్‌లో తనకు ఎదురైన చేదు సంఘటనను వివరించారు. అమైరా ‘ఇష్క్‌’ సినిమాతో 2013లో బాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. ఆ తర్వాత ‘మిస్టర్‌ ఎక్స్‌’, ‘కాలాకండి’, ‘కుంగ్‌ఫూ యోగా’ వంటి హిందీ చిత్రాల్లో నటించారు. అంతేకాదు ఆమె తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమకు కూడా సుపరిచితురాలే. ‘మనసుకు నచ్చింది’, ‘రాజు గాడు’ సినిమాల్లో ఆమె కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. తాజాగా చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులపై జరుగుతున్న పోరాటంలో భాగంగా మీడియా ఆమెను ప్రశ్నించింది. నటిగా ఈ ప్రయాణంలో వేధింపులు ఎదురు కాలేదా? అని అడిగింది. దీనికి అమైరా స్పందిస్తూ.. ‘నిజాయతీగా చెప్పాలంటే నాకు దక్షిణాదిలోనూ, బాలీవుడ్‌లోనూ క్యాస్టింగ్‌ కౌచ్‌ ఎదురుకాలేదు. కానీ రెండు చిత్ర పరిశ్రమల్లోనూ వేధింపులు ఎదుర్కొన్నాను. వారి పేర్లు చెప్పే ధైర్యం నాకు లేదు.. ఎందుకంటే వారు పవర్‌ఫుల్‌ వ్యక్తులు. కానీ కచ్చితంగా ఓ రోజు వారి గురించి బయటపెడుతా. వారికి తెలుసు.. వారు ఏం చేశారో. వారికి నేను ఒక్కటి చెప్పాలి అనుకుంటున్నా.. ఇకపై అయినా వేధించడం ఆపండి. రోజులు మారాయి.. మీ కర్మ నుంచి మీ పేరు ప్రఖ్యాతులు మిమ్మల్ని కాపాడలేని రోజులు వస్తున్నాయి’ అని అన్నారు. అనంతరం ఓ సినిమాలో సెట్‌లో జరిగిన విషయాలు తెలుపుతూ.. ‘ఓ సినిమా పాట షూటింగ్‌ సమయంలో నటుడు నాతో అసభ్యంగా ప్రవర్తించాడు, నన్ను తడిమాడు. నా చెవి దగ్గరికి వచ్చి.. ‘ఈ సినిమా కోసం నీతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది’ అన్నాడు. నేను అతడ్ని పక్కకు నెట్టా. అప్పటి నుంచి మాట్లాడటం మానేశా. ఆ తర్వాత నేను చాలా చేదు అనుభవాలు ఎదుర్కొనేలా అతడు చేశాడు’. ‘నటుడితో చనువుగా ఉండమని దర్శకుడు నాతో చెప్పాడు. నన్ను సెట్‌కు త్వరగా రమ్మని పిలిచేవారు. నా షూట్‌ కోసం గంటలు గంటలు ఎదురు చూసేలా చేసేవారు. రోజుకు 18 గంటలు సెట్‌‌లోనే ఉండేదాన్ని. దర్శకుడు కావాలనే రోజూ షూట్‌‌లో అరిచేవాడు. నన్ను సెట్‌కు రమ్మని.. వ్యాన్‌లోనే 12-13 గంటలు వెయిట్‌‌ చేయించేవారు. తర్వాత సహాయ దర్శకుడ్ని పంపి ఇవాళ మీ షూట్‌ లేదు అని చెప్పించేవాడు. ఈ సినిమాకు నిన్ను తీసుకోవడమే నీ అదృష్టం అని దర్శకుడు అనేవాడు’. ‘నటుడికి క్షమాపణలు చెప్పమని నిర్మాత నాతో అన్నారు. నేను అతడ్ని దూరంగా ఉంచినందుకు, అలా ప్రవర్తించినందుకు ఇలా చేయాల్సి వచ్చింది. చివరికి క్షమాపణలు చెప్పా’ అని ఆమె తెలిపారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com