కరీంనగర్ సభలో అమిత్ షా

వచ్చే ఏప్రిల్‌ – మేలో జరగాల్సిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందుకు జరిపి ప్రజలపై అదనపు భారం మోపారని భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా విమర్శించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొంటే తనకు ఇబ్బంది అవుతుందని భావించిన కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని ఆరోపించారు. బుధవారం కరీంనగర్‌లోని అంబేడ్కర్‌ మైదానంలో భాజపా నిర్వహించిన సమరభేరి సభలో ఆయన ప్రసంగించారు. కేసీఆర్‌ పాలనలో యువతకు ఉద్యోగాలూ రాలేదని, ఇచ్చిన హామీలూ నెరవేర్చలేదని మండిపడ్డారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తానన్న వాగ్దానాన్ని కేసీఆర్‌ నిలుపుకోలేదన్నారు. 2014లో తెరాస ప్రభుత్వం ఏర్పడితే దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్‌.. 2018లోనూ ఎస్సీని సీఎంగా చేయరన్నారు. తదనంతర కాలంలోనూ ఎస్సీని ముఖ్యమంత్రిని చేసే ఉద్దేశం కేసీఆర్‌కు లేదని అమిత్‌ షా అభిప్రాయపడ్డారు. తన కుమారుడు, కుమార్తెను అధికార పీఠంపై కూర్చోబెట్టాలన్నదే కేసీఆర్‌ ఆలోచనగా ఉందని దుయ్యబట్టారు. తెరాస ప్రభుత్వం అన్ని విషయాల్లోనూ ఘోరంగా విఫలమైందన్నారు. ప్రజలకు గత ఎన్నికల్లో ఇచ్చిన 150 వాగ్దానాల్లో ఏ ఒక్కటీ అమలుచేయలేదని మండిపడ్డారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com