Devotional

మంగళవారం నుండి భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు

Vykuntha Ekadashi 2020 In Bhadrachalam From Dec 15th

భద్రాద్రి శ్రీ సీతా‌రా‌మ‌చం‌ద్ర‌స్వామి క్షేత్రంలో ఈ నెల 15 నుంచి వైకుంఠ ఏకా‌దశి ఉత్స‌వాలు నిర్వ‌హిం‌చ‌ను‌న్నారు. కరోనా వ్యాప్తి నేప‌థ్యంలో పరి‌మిత సంఖ్యలో భక్తు‌లను అను‌మ‌తిం‌చ‌ను‌న్నట్టు ఆలయ ఈవో శివాజీ తెలి‌పారు. ఈ నెల 15 నుంచి జన‌వరి 4 వరకు చేపట్టే వైకుంఠ ఏకా‌దశీ ప్రయుక్త అధ్య‌య‌నో‌త్స‌వా‌లలో భాగంగా ప్రతిరోజూ స్వామి‌వా‌రిని వివిధ అవ‌తా‌రాల్లో సేవిం‌చ‌ను‌న్నట్టు పేర్కొ‌న్నారు. ఇందులో భాగంగా స్వామి వారు దశావతారాల్లో దర్శనమివ్వనున్నారు. ఈనెల 15న మత్స్యావతారం, 16న కూర్మావతారం, 17న వరహావతారం, 18న నరసింహావతారం, 19న వామనవతారం, 20న పరశురామవతారం, 21న రామావతారం, 22న బలరామావతారం, 23న కృష్ణావతారంలో సీతారామచంద్రస్వామి భక్తులకు దర్శనమివ్వనున్నార‌ని తెలిపారు. క‌రోనా నేప‌థ్యంలో ఆలయ ప్రాంగ‌ణం‌లోనే ఉత్సవ విగ్ర‌హాల ఊరే‌గింపు ఉంటుం‌దని చెప్పారు. ఏటా గోదా‌వరి నదిలో జరిపే తెప్పో‌త్స‌వాన్ని ఈసారి గోశాల వద్ద నిర్వ‌హిస్తామ‌ని వెల్ల‌డించారు. ఈనెల 25న ఉత్తర ద్వార దర్శనం సంద‌ర్భంగా 200 మంది భక్తు‌లను మాత్రమే అను‌మ‌తిం‌చ‌ను‌న్నట్టు తెలిపారు