పేగు బాక్టీరియా జాగ్రత్త

మన ఆరోగ్యం విషయంలో పేగుల్లోని బ్యాక్టీరియా చాలా కీలక పాత్ర పోషిస్తుంది. సంక్లిష్ట పిండి పదార్థాలను జీర్ణం చేయటం దగ్గర్నుంచి రోగనిరోధకవ్యవస్థకు తర్ఫీదు ఇవ్వటం వరకూ ఎన్నెన్నో పనులు నిర్వర్తిస్తుంది. అంతేనా? ఇది ఆయుష్షు పెరగటానికీ తోడ్పడుతున్నట్టు తాజాగా బయటపడింది. వృద్ధుల ఆరోగ్యం మెరుగ్గా ఉండటానికీ పేగుల్లోని బ్యాక్టీరియాకూ గణనీయమైన సంబంధం కనబడుతుండటమే దీనికి నిదర్శనం. మంచి ఆరోగ్యంగా ఉన్న 90 ఏళ్ల వృద్ధుల్లో కూడా యువ ఆరోగ్యవంతుల పేగుల్లో మాదిరిగానే బ్యాక్టీరియా రకాలు కనబడుతున్నట్టు తేలింది మరి. వృద్ధుల ఆరోగ్యానికి బ్యాక్టీరియా దోహదం చేస్తోందా? ఆరోగ్యవంతుల పేగుల్లో మంచి బ్యాక్టీరియా ఉంటోందా? అనేది స్పష్టంగా తెలియనప్పటికీ.. ఈ రెండింటికీ లంకె ఉండటం మాత్రం నిజమని పరిశోధకులు పేర్కొంటున్నారు. అంటే రక్తనాళాల ఆరోగ్యానికి కొలెస్ట్రాల్‌ మాదిరిగానే వృద్ధుల ఆరోగ్యానికీ పేగుల బ్యాక్టీరియాను జీవసూచికగా భావించవచ్చన్నమాట. అందువల్ల పెరుగు, పులియబెట్టిన పదార్థాల వంటి ప్రొబయోటిక్స్‌ తీసుకోవటం మంచిది. ఇవి పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందటానికి తోడ్పడతాయి. ప్రొబయోటిక్స్‌ కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తాయి, కొన్నిరకాల క్యాన్సర్ల బారినపడకుండా చూస్తాయి. అందువల్ల ఇవి ఆరోగ్యంగా ఉండటానికి, ఆయుష్షు పెరగటానికి దోహదం చేసే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com