ఏపీలో అభివృద్ధి చెందిందని చెప్పుకోదగిన పట్టణ ప్రాంతం లేదు-చంద్రబాబు

15వ ఆర్థిక సంఘానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజెంటేషన్

రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, నాలుగేళ్లలో ప్రభుత్వం సాధించిన ప్రగతిపై ప్రజెంటేషన్

తలసరి ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ వెనుకబడింది

విశాఖ, అమరావతి మినహా చెప్పుకోదగిన పట్టణ ప్రాంతం లేదు

అమరావతి పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందడానికి ఇంకా 20 ఏళ్లు పడుతుంది

ఏపీలో రెండో దశ సంస్కరణలు అమలు చేసింది నేనే

హైదరాబాద్ లో నేను వేసిన పునాదులే ఇవాళ విజ్ఞాన సమాజంగా మారింది

రాజకీయం ఏవిధంగా ఒక సామాన్యుడిని దెబ్బతీస్తుందో ఉదాహరణే ఏపీ

ప్రజల భావోద్వేగాలను అభివృద్ధి వైపు మళ్లించాను

నవనిర్మాణ దీక్ష, మహాసంకల్పం తీసుకున్నా

ప్రజల్లో ప్రత్యేక హోదా అంశం ఒక భావోద్వేగ అంశంగా మారింది

హోదా ఇవ్వకపోవడంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది

తుపాన్లు, కరువుతో ఏటా సతమతమవుతున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్

ప్రత్యేక హోదా పార్లమెంటులో ఏపీకి ప్రధాని ఇచ్చిన వాగ్దానం

నాలుగేళ్లయినా ప్రత్యేక హోదా హామీ నెరవేర్చలేదు

ప్రారంభ దశలో చేయూత అందిస్తే మా కష్టంతో దేశానికి సంపద అందిస్తాం

జాతి సంపదను పెంచేందుకు తపనపడే ప్రజలను నిరాశపరచవద్దు

నాకు మేలుచేయాలని కోరట్లేదు, రాష్ట్రానికి మేలు చేయాలని అడుగుతున్నా

మా కష్టాన్ని గుర్తించి మాకు సహాయం చేయండి

ఆర్థిక సంఘాల నివేదికలకు 1971 జనాభా లెక్కలే ప్రాతిపదిక కావాలి

2026 వరకు ఈ జనాభా లెక్కలనే ప్రతిపదికగా తీసుకోవాలి

2011 జనాభా లెక్కలను తీసుకుంటే ఏపీపై నేరుగా ప్రభావం పడుతుంది

మధ్యప్రదేశ్ లో మెట్రోలకు భారీగా నిధులు సమకూర్చారు

ఏపీలో విశాఖ, విజయవాడ మెట్రోలకు మోకాలడ్డుతున్నారు

మా ప్రమేయం లేకుండానే మమ్మల్ని బలిపశువులను చేస్తున్నారు

12, 13 ఆర్థిక సంఘాల కాలంలో నయారాయపూర్ కు రూ.4500 కోట్లు సాయం చేశారు

అమరావతికి కనీసం రూ.9000 కోట్లు కేంద్రం గ్రాంటుగా ఇచ్చేలా చూడాలి

విపత్తు సాయంగా ఇప్పుడు ఇస్తోంది కేవలం అరకొరే

రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు

దేశంలో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు

రైతులు కరువు, భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయారు విపత్తు

సాయం పెంచాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది

వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి రూ.22,500 కోట్లు సిఫార్సు చేయాలి

సుస్థిర వృద్ధి ఉంటే తప్ప పొరుగు రాష్ట్రాలతో సమానంగా రాష్ట్రం అభివృద్ధి చెందలేదు

వెనుకబడిన జిల్లాలకు న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే

బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ ఇస్తామని చెప్పి పట్టించుకోలేదు

ఇచ్చిన రూ.350 కోట్ల నిధులు వెనక్కి తీసుకున్నారు

వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి రూ.22,500 కోట్లు సాయం అందించాలని సిఫార్సు చేయాలని ఆయన కోరారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com