వచ్చే ఎన్నికల్లో వేలుపెడతారా?

కాట్సా చట్టాన్ని లెక్కచేయకుండా ఎస్‌-400 కొనుగోళ్లకు భారత్‌ పచ్చజెండా ఊపడంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ నర్మగర్భవాఖ్యలు చేశారు. ‘భారత్‌ త్వరలోనే తెలుసుకొంటుంది’ అని పేర్కొన్నారు. ఇప్పుడు ఆ వ్యాఖలు సంచలనం రేపుతున్నాయి. బుధవారం వాషింగ్టన్‌లోని ఓవల్‌ కార్యాలయంలో విలేకర్లతో ఇష్టాగోష్టి సందర్భంగా భారత్‌ ఎస్‌-400 ఒప్పందంపై ట్రంప్‌ను విలేకర్లు ప్రశ్నించారు. దీనికి ఆయన స్పందిస్తూ ‘‘ ఆంక్షల పరిధిలోకి వస్తారో లేదో భారత్‌ త్వరలోనే తెలుసుకుంటుంది. ఊహించిన దానికన్నా ముందే దీనిపై మీకు సమాధానం లభిస్తుంది. ’’ అని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో అమెరికా సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ మైక్‌ పాంపియో కూడా అక్కడే ఉన్నారు. విలేకర్లతో ఇష్టాగోష్టి తర్వాత ట్రంప్‌-పాంపియోలు సమావేశం కావాల్సి ఉంది. భారత్‌కు కాట్సా చట్టం కింద మినహాయింపును ఇచ్చే అధికారం కేవలం అమెరికా అధ్యక్షుడికి మాత్రమే ఉంది. ఆయుధాల కోసం రష్యాపై ఆధారపడిన అమెరికా మిత్రదేశాలకు వర్తిస్తుంది. ఇది కూడా చాలా పరిమితంగా మాత్రమే. ఇదే విషయాన్ని ఇప్పటికే శ్వేతసౌధానికి చెందిన నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ ప్రతినిధి తెలిపారు. మరో పక్క భారత్‌లో అమెరికా రాయబారి ప్రతినిధి మాట్లాడుతూ‘‘ కాట్సా చట్టం రష్యాను కట్టడి చేయడానికి మాత్రమే అన్నారు. అంతేకానీ అమెరికా మిత్రదేశాల సైనిక సామర్థ్యాన్ని దెబ్బతీయడానికి కాదు’అని పేర్కొన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com