ఇది కురుక్షేత్ర సంగ్రామం

సీఎం కేసీఆర్‌ కుటుంబానికి, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు మధ్య కురుక్షేత్రం జరగబోతోందని కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. నిజామాబాద్‌లో కాంగ్రెస్‌ నేత అరికెల నర్సారెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రేవంత్‌ మాట్లాడారు. గత ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి కేసీఆర్‌ అధికారంలోకి వచ్చారని ఆయన ఆరోపించారు. రూ.లక్ష రుణమాఫీ పేరుతో రైతులను నిండా ముంచారని, కనీసం పండిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వలేకపోయారని విమర్శించారు. తెరాసకు అండగా ఉండే జిల్లాకు కేసీఆర్‌, ఎంపీ కవిత ఏం చేశారని ప్రశ్నించారు. పసుపు బోర్డు సాధిస్తామని హామీ ఇచ్చిన కవిత మాట నిలబెట్టుకోలేక పోయారన్నారు. ప్రగతిభవన్‌లోకి వెళ్లి బాధలు చెప్పుకుందామంటే ప్రజలకు అనుమతించడం లేదని.. కాంట్రాక్టర్లు, సినీనటులు, బంధువులను మాత్రమే అనుమతిస్తున్నారని రేవంత్‌ దుయ్యబట్టారు. అంతకుముందు జిల్లాకు చేరుకున్న రేవంత్‌కు ఇందల్వాయి టోల్‌ ప్లాజా వద్ద నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com