Fashion

ఆకలితో బరువు నియంత్రణ ఇలా..

ఆకలితో బరువు నియంత్రణ ఇలా..

ఎక్కువ గంటల పాటు ఉపవాసం చేయలేకపోయినా, అడపాదడపా ఆకలిని చంపుకుంటూ తేలికపాటి ఉపవాసాలు చేస్తూ కూడా అధిక బరువు తగ్గించుకోవచ్చు.
వ్యాయామం:
వ్యాయామం అలవాటున్న వారికి ఆకలి గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే వ్యాయామం తదనంతరం పెరిగే ఆకలిని వెంటనే తీర్చేసుకోకుండా, కొంత ఆలస్యం చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మెటబాలిజం వేగవంతమవుతుంది.
*నీళ్లు తాగాలి:
ఆకలిని దూరం పెట్టాలన్నా, అలాగే జిహ్వచాపల్యాన్ని అదుపులో ఉంచాలన్నా నీళ్ల మీదే ఆధారపడాలి. కాబట్టి ఉపవాసం ఉండాలనుకునే వాళ్లు తరచుగా నీళ్లు తాగుతూ ఉండాలి.
*బ్లాక్‌ కాఫీ:
చక్కెర, పాలు కలిపిన కాఫీ మీద మీకు మక్కువ ఉన్నా, ఉపవాసం చేసే సమయంలో కేవలం బ్లాక్‌ కాఫీనే తాగాలి. మరీ ముఖ్యంగా ఉపవాసాన్ని బ్లాక్‌ కాఫీతో మొదలు పెడితే ఆకలి అదుపులో ఉంటుంది.
*ఉప్పు:
భరించలేని ఆకలి వేస్తే, మణికట్టు మీద ఉప్పు చల్లుకుని నాకాలి. ఇలా చేయడం వల్ల ఆకలి దూరమవడంతోపాటు, తినాలనే కోరికా తగ్గుతుంది.