* కృష్ణా జిల్లా తిరువూరులో వాలంటీర్ నిర్వాకం. పట్టణం లోని 18వార్డుకు చెందిన వాలంటీర్ ప్రేమ పేరుతో మైనర్ బాలికను మోసగించిన వైనం. వివాహం అయ్యి భార్య, ఇద్దరు పిల్లలు వున్నా అడ్డదారులు తొక్కిన వాలంటీర్. మైనర్ బాలిక తల్లితండ్రుల ఫిర్యాదు మేరకు వాలంటీర్ ను అదుపులోకి తీసుకుని ఫోక్సో చట్టం క్రింద కేసు నమోదు చేసిన తిరువూరు పట్టణ పోలీస్ లు.
* గుంటూరు జిల్లాలో ఏపీ వడ్డెర డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రేవతి మేనల్లుడు రెచ్చిపోయాడు. దాచేపల్లి మండలంలోని క్రాంతి నర్సింగ్ హోమ్‌లో హల్‌చల్ చేశాడు.వైద్యం అనంతరం బిల్లు కట్టమని ఆస్పత్రి సిబ్బంది అడగడంతో దురుసుగా ప్రవర్తించాడు వడియరాజు. తాను దేవుళ్ల రేవతి మేనల్లుడినని బిల్లు తక్కువ చేయాలని డిమాండ్ చేశాడు.దానికి ఆస్పత్రి సిబ్బంది ఒప్పుకోకపోవడంతో బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆస్పత్రి సిబ్బందిపై దాడికి దిగాడు. దీంతో ఆస్పత్రిలోని పేషెంట్స్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.వడియరాజు తీరుపై ఆస్పత్రి సిబ్బంది పోలీసులను ఆశ్రయించారు. కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.ఆస్పత్రి సిబ్బందిపై వడియరాజు దాడి దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
* తుళ్ళరు డిఎస్పీ ని కలిసిన అమరావతి మహిళా జేఏసీ నేతలు.మూడు రాజధానులు శిబిరానికి అనుమతి ఉందా అని అడిగిన మహిళలు.మూడు రాజధానుల శిబిరానికి అనుమతి ఉందొ లేదో తెలపాలంటూ ఆర్ టి ఐ కింద సమాచారం కోరిన మహిళ జచ్ నేత సుంకర పద్మశ్రీ.సుంకర పద్మశ్రీ, మహిళా జేఏసీ నాయకురాలు.
* చైనాతో సరిహద్దు వివాదం కొనసాగుతున్న వేళ త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ కీలక విషయాన్ని వెల్లడించారు.వివిధ మిషన్‌లకు మద్దతుగా హిందూ మహాసముద్ర ప్రాంతంలో 120 యుద్ధనౌకలను మోహరించినట్లు తెలిపారు.అంతర్జాతీయ భద్రతా సదస్సులో ప్రసంగించిన రావత్.. శాంతి, సార్వభౌమత్వాన్ని కాపాడాలంటే సముద్ర తీరాల్లోని సమాచార వ్యవస్ధ సురక్షితంగా ఉండడం చాలా కీలకం అని అన్నారు.ప్రస్తుతం హిందూ మహాసముద్ర ప్రాంతం శాంతియుతంగానే ఉందని తెలిపారు.
* పూంచ్ జిల్లా నియంత్రణ రేఖ వెంబడి సైనిక బలగాలు నిర్వహించిన ప్రతీకార దాడుల్లో ఐదుగురు పాకిస్థాన్ సైనికులు హతమయ్యారు.మరో ముగ్గురు గాయపడినట్టు రక్షణశాఖ ప్రకటించింది. ఈ ఘటనలో పాక్ బంకర్లనూ ధ్వంసం చేసినట్టు పేర్కొంది.పూంచ్ జిల్లాలోని మాన్‌కోట్ సెక్టర్లో భారత పౌరులను లక్ష్యంగా చేసుకుని గురువారం కాల్పులకు తెగబడింది పాకిస్థాన్.విచక్షణారహితంగా జరిపిన ఈ దాడుల్లో.. భారత పౌరులకు ఆస్తి నష్టం కలిగింది. ఈ నేపథ్యంలో ఎదురుదాడికి దిగింది భారత సైన్యం.సుమారు 2 గంటల పాటు ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ క్రమంలోనే ఐదుగురు పాక్ సైనికులను మట్టుబెట్టింది భారత ఆర్మీ.ఈ ఏడాది ఆరంభం నుంచి ఇప్పటివరకు 3,200 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది పాక్.
* ఈ నెల 14న తమ ఎదుట హాజరుకావాలని బంగాల్ ముఖ్య కార్యదర్శి, డీజీపీకి కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై రాళ్ల దాడి నేపథ్యంలో ఈమేరకు చర్యలు చేపట్టింది.బంగాల్లో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై రైళ్ల దాడి జరిగిన ఒక రోజు అనంతరం.. ఆ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి, డీజీపీకి కేంద్ర హోంశాఖ సమన్లు జారీ చేసింది.ఈ నెల 14న తమ ముందు హాజరుకావాలని స్పష్టం చేసింది. ఘటనకు గల కారణాలతో పాటు రాష్ట్రంలో శాంతి భద్రతలపై హోంశాఖ ప్రశ్నలు సంధించే అవకాశముంది.