బ్రహ్మచర్యంతో దీర్గాయుష్షు

ఆహారం తరువాత మజ్జిగ సేవించడం వలన విరుద్ద ఆహారాల విషమును తొలగించును.

గ్రహణి , ఆర్శ రోగములను మరియు నెయ్యి వలన కలుగు విపత్తులను తొలగించును.

పెరుగు యందు నాలుగోవంతు నీరు చేర్చి తయారుచేసిన మజ్జిగను తక్రము అందురు. ఇది శ్రేష్టమైనది.

నువ్వులనూనెను పుక్కిట పట్టుట వలన దంతాలకు బలం చేకూర్చును.దంతవ్యాధులను రానివ్వదు.నములుతున్న వానికి రుచిని తెలుపును.

* అన్నం స్థితిని కలుగచేయును . నీరు సంతృప్తిని కలుగచేయును .పాలు ఆయువును వృద్దిచేయును.

* అన్ని పాలకంటే ఆవుపాలు శ్రేష్టం.

* వృక్షసంబంధమైన నూనెల్లో నువ్వులనూనె చాలా శ్రేష్టమైనది.

* నెయ్యిలన్నింటిలో ఆవునెయ్యి శ్రేష్టమైనది.

* పప్పుధాన్యాలలో పెసలు శ్రేష్టమైనవి.

* ఆకుకూరల్లో పాలకూర శ్రేష్టమైనది.

* దుంపజాతుల్లో అల్లం శ్రేష్టమైనది.

* ఫలములో ద్రాక్షాపండ్లు శ్రేష్టమైనవి.

* ఉప్పులలో సైన్ధవలవణం శ్రేష్టమైనది.

* వర్షాకాలం నందు నదులయందు నీరు మంచిదికాదు. చవిటి ఉప్పు ప్రకృతిపరంగా అంత మంచిది కాదు.

* గొర్రెపాలు, గొర్రె నెయ్యి ఆరోగ్యానికి మంచిది కాదు.

* నిమ్మపండు అతిగా వాడరాదు.

* దుంపల యందు బంగళాదుంప ఎక్కువ వాడరాదు.

* మలమూత్రాదులు బలవంతంగా ఆపుట వలన శరీరం రోగాలపాలు అగును.

* తినిన పదార్ధం అరగనప్పుడు ఉప్పు తినిన ఆ ఆహారాన్ని ద్రవరూపంలోకి మార్చి జీర్ణం అయ్యేలా చేయును .

* హృదయమునకు మేలు చేయడంలో ఆమ్లరసం ఉత్తమమైనది.

* మినుములు అతిగా భుజించరాదు.

* శరీర శ్రమని తొలగించుటలో శ్రేష్టమైనది.

* విరిగిన పెరుగు తినడం వలన శరీరం నందలి వాయుమార్గాలను అడ్డగించును.

* గేదపాలు నిద్రను కలుగచేయుటలో శ్రేష్టమైనవి.

* ఉసిరికాయపచ్చడి పదిహేను రోజులకు ఒకసారి తినుటచే వయస్సుని నిలుపుచేయుటలో యోగ్యమైనవి.

* నెయ్యి వాతమును , పిత్తమును అధికం చేయడంలో శ్రేష్టమైనది.

* నువ్వులనూనె వాతమును, శ్లేష్మమును శమింపచేయడంలో శ్రేష్టమైనది.

* తేనె శ్లేష్మమును, పిత్తమును శమింపచేయడంలో శ్రేష్టమైనది.

* కరక్కాయ ఎల్లకాలముల యందు వాడుకొనతగినది.

* ఇంగువ వాతమును , కఫమును అధికంగా శమింపచేయును . దోషములను మలరూపం పొందించును. జఠరాగ్నిని వృద్ధిపొందించును. ఆశ్రయమును పొందిన దోషములను ఛేదించుట యందు శ్రేష్టమైనది.

* ఉలవలు ఆమ్లపిత్తవ్యాధిని కలుగచేయును.

* వాయువిడంగములు క్రిములను పోగొట్టుటకు శ్రేష్టమైనవి.

* మినుములు శ్లేష్మమును , పిత్తమును వృద్ధిచెందించును.

* అరటిపండు పాలతో, పెరుగుతో , మజ్జిగతో తీసుకోరాదు .

* నిమ్మకాయ పాలతో , పెరుగుతో , మినపప్పుతో కూడి తినరాదు.

* బుద్ధి, స్మృతి మద్యము వలన హరించబడును. కావున మద్యం సేవించరాదు .

* ఆహారం తీసుకొనక ముందు వ్యాయమం చేయవలెను . వ్యాయామం వలన శరీరభాగాలు దృఢత్వం పొందును.

* బ్రహ్మచర్యం ఆయువును వృద్దిచెందించును.

* రజస్వల సమయంలో స్త్రీసంగమం దరిద్రానికి హేతువు.

* దుఃఖము వలన రోగములు వృద్ది పొందును.

* ఏ విద్యాకలవారు ఆ విద్య వచ్చిన వారితో సంభాషించుట మేలు .

* గర్భవతి వ్యాయమం మరియు తీక్షణమైన మందులు విడువవలెను.

* మలమూత్ర విసర్జన సమయంలో వెరే కార్యములు చేయరాదు .

* సంధ్యాకాలం నందు భోజనం , అధ్యయనం, స్త్రీ సంగమం, నిద్ర నిషిద్దం.

* రాత్రి సమయం నందు సంచరించకూడని ప్రదేశములకు పోరాదు.

* పిల్లలు, ముసలివారు, మూర్ఖులు , నపుంసకులు వీనితో స్నేహం చేయరాదు .

మద్యపానం, జూదం ఆడుట, వేశ్యాప్రసంగం నందు అయిష్టుడుగా ఉండవలెను .

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com