న్యూజీలాండ్ బతుకమ్మ సంబురాల్లో పాల్గొన్న ఆ దేశ ప్రధాని

తెలంగాణ సంప్రదాయ పండగ బతుకమ్మ ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఉన్న తెలంగాణ వాసులు కూడా ఈ బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకొంటున్నారు. న్యూజిలాండ్‌లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో ఆ దేశ ప్రధానమంత్రి జెసిండా ఆర్డెర్న్‌ పాల్గొని సందడి చేశారు. న్యూజిలాండ్‌లోని తెలంగాణ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో స్థానికంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకకు హాజరైన ఆ దేశ ప్రధాని జెసిండా తెలంగాణ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ ఫొటోలను కేటీఆర్‌ ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు. బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న జెసిండాకు ధన్యవాదాలు తెలిపారు. ఓ దేశ ప్రధాని బతుకమ్మ సంబరాల్లో పాల్గొనడం ప్రపంచ చరిత్రలో ఇదే తొలిసారి అని కేటీఆర్‌ ఆనందం వ్యక్తం చేశారు. బతుకమ్మ సంబరాలు నిర్వహించిన తెలంగాణ అసోసియేషన్‌కు అభినందనలు తెలిపారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com