నందమూరి బాలకృష్ణ – కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కనుంది. సి.కల్యాణ్ నిర్మాత. ఈ చిత్రానికి ‘రూలర్’ అనే పేరు పరిశీలనలో ఉంది. ఇద్దరు నాయికలుంటారు. ప్రస్తుతం వారి కోసం అన్వేషణ జరుగుతోంది. ఓ కథానాయికగా పాయల్ రాజ్పుత్ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ‘ఆర్.ఎక్స్ 100’తో ఆకట్టుకున్న పాయల్‌కి వరుసగా అవకాశాలొస్తున్నాయి. ప్రస్తుతం ‘ఆర్డీఎక్స్’ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికీ సి.కల్యాణే నిర్మాత. ఆయనే పాయల్‌కి మరో అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈవారంలోనే హైదరాబాద్‌లో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. జూన్ నుంచి చిత్రీకరణ మొదలవుతుంది. జగపతిబాబు ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. సంగీతం: చిరంతన్ భట్
బాలయ్యతో పాయల్
Related tags :