Sports

మా నాన్న ఇష్టం

టీమిండియా మాజీ డాషింగ్‌ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌.. నేడు 39వ పుట్టిన రోజును జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా యువీ ట్విటర్‌ వేదికగా ఎమోషనల్‌ అయ్యాడు. ‘ఈసారి పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలనుకుంటున్నా. దేశానికి రాజుగా అభివర్ణించే రైతు ఈరోజు నిరసనలు చేయడం బాధగా ఉంది. పుట్టినరోజులనేవి వస్తుంటాయి.. పోతుంటాయి.రైతులు దేశానికి వెన్నముక అన్న మాట నిజం.. వారు చేస్తున్న ఆందోళన త్వరలోనే సమసిపోవాలని.. కేంద్రంతో చర్చలు శాంతియుత వాతావరణంలో జరగాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా. రైతుల చేస్తున్న ఆందోళనకు నా తండ్రి యోగరాజ్‌ మద్దతు పలికారు. వారి ఆందోళన సరైనదేనని.. వెంటనే రైతుల డిమాండ్లను నెరవేర్చాలని కేంద్రానికి తెలిపారు. అంతేగాక రైతుల ఆందోళనకు మద్దతుగా కొందరు క్రీడాకారులు తమ అవార్డులను కూడా వెనక్కి ఇచ్చేస్తున్నారు. ఇలా చేస్తున్నారంటే రైతుల ఉద్యమంలో నిజం ఉందని ..అందుకే వారి సమస్యలు తీర్చాలని నా తండ్రి పేర్కొనడం బాధ కలిగించింది. ఆయన ఆలోచన విధానాలతో నేను సరితూగలేను.ఎవరి ఐడియాలజీ వారికి ఉంటుంది. ఆయన వ్యాఖ్యలను నేను తప్పుబట్టలేను.. అలా అని సమర్థించలేను.అంతేకాదు కోవిడ్ -19 మహమ్మారి ఇంకా ముగియలేదు. కరోనా వైరస్ పై పోరాడటానికి జాగ్రత్తలు తీసుకోవాలని రైతులను కోరుతున్నా. జై జవాన్, జై కిసాన్! జై హింద్‌’ అంటూ ఉద్వేగంతో ముగించాడు.