కేశవరావుతో మహేష్ బిగాలా భేటీ

తెరాస మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కేశవరావును కలిసిన తెరాస NRI కోఆర్డినేటర్ మహేష్ బిగాలా. గత వారం తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో యూఏఈ ఆమ్నెస్టీ బాధితుల ను తెలంగాణ చేర్చడం కోసం వెళ్లిన అధికార బృందంతో పాటు తెరాస NRI కోఆర్డినేటర్ మహేష్ బిగాలా వెళ్లి తనతో పాటు 35 మంది బాధితులను తీసుకొని వారిని తమ స్వస్థలాలకు చెర వెయ్యడంలో కీలక పాత్ర పోషించారు . ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం కృషితో 163 మందిని తమ స్వస్థలాలకు సురక్షితంగా చేర్చినట్టు తెలిపారు . యూఏఈ పర్యటనలో గల్ఫ్ సంఘాల ప్రతినిధులను , కార్మికులను , తెరాస గల్ఫ్ నాయకులను తానూ కలుసుకొని వారి విన్నపాలను వినడం జరిగింది .అన్ని రకాల విన్నపాలను పొందుపరిచినా విజ్ఞాపన పత్రాన్ని తెలంగాణ ప్రవాస వ్యవహారాల ఆపద్ధర్మ మంత్రి KTR కి సమర్పించడం జరిగిందని తెలిపారు. ఈ రోజు ఉదయం తెరాస పార్టీ ఎన్నికల సందర్భంగా ప్రవేశపెట్టే మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కేశవరావుని కలిసి, NRIల పలు సమస్యలపైనా చర్చించి, సమగ్రమైన NRI విధివిధానాలు, గల్ఫ్ ప్రాంతానికి అధిక నిధుల కేటాయింపుతో పాటు పలు అంశాలను పార్టీ మేనిఫెస్టోలో చేర్చవలసిందిగా కోరుతూ వినతిపత్రం సమర్పించడం జరిగింది. కేశవరావు, తెరాస పార్టీ అధ్యక్షుడు కే.చంద్రశేఖరరావు, ఇతర కమిటీ సభ్యులతో చర్చించి, మేనిఫెస్టోలో NRI సమస్యలను పరిష్కారించె సమగ్రమైన విధానాలను ప్రకటిస్తారని ఆశాభావం వ్యక్తపరిచారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com