* రాజధాని నిర్మాణ సామగ్రి తరలిపోతోంది!,రాజధాని అమరావతి ప్రాంతంలో నిర్మాణాలు ఆగిపోవటంతో గుత్తేదారులు తమ సామగ్రిని తరలించే పనిలో నిమగ్నమయ్యారు.,- తుళ్లూరు నుంచి దొండపాడు వెళ్లే మార్గంలో రహదారి పక్కన ఉన్న పైపులను గుత్తేదారులు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు.,- రహదారి పనులు కోసం తెచ్చిన సామాగ్రి.. పనులు నిలిచి పోవడంతో అవి పాడవుతున్నాయి.,- కొన్ని ఇప్పటికే చోరీకి గురయ్యాయి. దీంతో గుత్తేదారులు మిగిలినవాటిని సంరక్షించుకునేందుకు భారీ క్రేన్లులతో పైపులను ఇతర సామగ్రిని తరలిస్తున్నారు.,★ రాజధాని అమరావతి నిర్మాణం కోసం గతంలో తీసుకొచ్చిన సామగ్రిని గుత్తేదారులు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. రాజధాని గ్రామాలైన తుళ్లూరు నుంచి దొండపాడు వెళ్లే మార్గంలో రహదారి పక్కన ఉన్న పైపులను శనివారం భారీ క్రేన్ల సాయంతో తీసుకువెళ్లారు.
* ఎన్నో ఏళ్లుగా నిరుద్యోగులు ఉద్యోగ నోటిఫికేషన్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.,నిరుద్యోగులందరికీ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణలో భారీగా ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది.,ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు ఆయా శాఖల్లో ఖాళీలను గుర్తించాలని సీఎస్‌కు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.,ఉపాధ్యాయ, పోలీసులతో పాటు ఖాళీ పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్లు వెలువడనున్నాయి.
* నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళన 18వ రోజుకు చేరుకుంది. నేటి నుంచి దిల్లీ నుంచి వివిధ నగరాలకు వెళ్లే రహదారుల్ని దిగ్బంధిస్తామని రైతులు ప్రకటించడంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆయా ప్రాంతాల్లో అదనపు బలగాల్ని మోహరించారు. రహదారుల దిగ్బంధంలో భాగంగా నేడు దిల్లీ-జయపుర మార్గంలో బైఠాయించేందుకు రైతులు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే ఆ దారిలో పోలీసులు భారీ స్థాయిలో పహారా కాస్తున్నారు. వాహనాల రాకపోకలకు ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా ఏర్పాటు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఇతర సరిహద్దు ప్రాంతాల్లోనూ బలగాల్ని అప్రమత్తం చేశారు.
* నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా సోమవారం తాను ఒక్కరోజు నిరాహార దీక్ష చేయనున్నట్లు దిల్లీ ముఖ్యమంత్రి , ఆప్ అధినేత కేజ్రీవాల్ వెల్లడించారు. ఆప్ కార్యకర్తలతో పాటు దేశ ప్రజలు కూడా ఒక్కరోజు నిరాహార దీక్షలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు వర్చువల్ ప్రెస్మీట్లో ఆయన పాల్గొన్నారు.
* రాజధాని గ్రామాల రైతులు, మహిళల నిరసనలు 362వ రోజుకి చేరుకున్నాయి. మందడం, తుళ్లూరు, వెలగపూడి, వెంకటపాలెం, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, ఉద్దండరాయునిపాలెం, రాయపూడి, నీరుకొండ, అనంతవరం, పెదపరిమి, ఐనవోలు, నెక్కల్లు, దొండపాడు, బేతపూడి, ఉండవల్లి తదితర గ్రామాల్లోని శిబిరాల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.
* నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలను ఉద్ధృతం చేసేందుకు రైతులు నిర్ణయించడంతో ఢిల్లీ సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.,ఢిల్లీ సరిహద్దుల్లో అదనపు సిబ్బందిని ఢిల్లీ పోలీసులు మోహరించారు.,నిరసన కార్యక్రమాల వల్ల ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొనకుండా నిరోధించేందుకు పటిష్ట చర్యలు చేపట్టారు.,ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ట్విటర్ వేదికగా వాహనదారులకు సూచనలు చేస్తున్నారు.,ఏయే మార్గాల్లో ప్రయాణించవచ్చునో తెలియజేస్తూ ట్వీట్లు చేస్తున్నారు.
* హామీల అమలులో తెరాస ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలమైందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి ఆరోపించారు. వికారాబాద్ జిల్లా పరిగిలో డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అనేక హామీలతో ఎన్నికల్లో విజయం సాధించిన తెరాస.. వాటి అమలు విషయంలో ప్రజల్ని మభ్యపెడుతోందని విమర్శించారు. టీపీసీసీ అధ్యక్ష పదవి గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా తనకు ఆ పదవికిపై ఆసక్తి లేదని.. పార్టీ ఎవరి పేరు ప్రతిపాదిస్తే వారికి సహకరించి సమష్టిగా పనిచేస్తామని స్పష్టం చేశారు.
* గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో పులుల సంచారం ఎక్కువైంది.,హైదరాబాద్ సిటీ శివారు ప్రాంతాల్లో చిరుతలు తరచుగా సంచరించడం ఆందోళన కలిగిస్తోంది.,తాజాగా, నిత్యం రద్దీగా ఉండే గచ్చిబౌలిలోని ఐటి కారిడార్ లో చిరుత సంచరిస్తుందన్న వార్త కలకలం సృష్టిస్తోంది. గచ్చిబౌలిలోని రొడా మిస్త్రీ కాలేజీలో ఓ కుక్కను చిరుత ఎత్తుకెళ్లింది.,కాలేజీలో చిరుత సంచరించినట్టు తెలిసిన వెంటనే స్థానికులు భయాందోళనకు లోనయ్యారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు హుటాహుటిన రంగంలోకి దిగి చిరుత కోసం ట్రాక్ కెమెరాలను ఏర్పాటు చేశారు.,అయితే, కాలేజీ పక్కన ఉన్న గుట్టల్లోకి చిరుత వెళ్లి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు.
* కరోనా వైరస్ సోకిన తర్వాత శరీరంలో వివిధ అవయవాలపై ఆ మహమ్మారి తీవ్ర ప్రభావం చూపిస్తోన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఊపిరితిత్తులపై వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. అయితే, కరోనా వైరస్ ఊపరితిత్తులను ఎలా నష్టపరుస్తోందన్న విషయంపై ఇప్పటివరకు స్పష్టత లేదు. దీనిపై పరిశోధనలు చేపట్టిన శాస్త్రవేత్తలు, ఊపిరితిత్తుల కణాలను ఈ కరోనా వైరస్ ఎలా దెబ్బతీస్తోందన్న విషయాన్ని డీకోడ్ చేయగలిగారు. దీంతో కరోనా వైరస్‌ను ఎదుర్కొనే చికిత్సను రూపొందించడంలో తాజా పరిణామం దోహదపడుతుందని అభిప్రాయపడుతున్నారు.
* గొర్రెలు లక్షల రూపాయల ధర పలకడం ఎప్పుడైనా విన్నారా. అయితే మీరు మహారాష్ట్రలోని సంగ్లీ జిల్లాకు వెళ్లాల్సిందే. ఒకటి, రెండూ కాదు ఏకంగా రూ.70లక్షలు వెచ్చించి మడ్గ్యాల్ జాతికి చెందిన గొర్రెను కొనుగోలు చేసేందుకు ఓ వ్యక్తి ముందుకు రావడం ఆశ్చర్యానికి గురిచేసింది. కానీ గొర్రె యజమాని ఆ ధరను నిరాకరించి.. రూ.1.50కోట్లకు అయితే అమ్ముతానని చెప్పడంతో కొనుగోలుదారుడు వెనుదిరిగాడు. సంగ్లీ జిల్లా తెహ్సిల్కు చెందిన బాబు మెట్కారీ కుటుంబం గత కొన్ని దశాబ్దాలుగా గొర్రెల వ్యాపారం చేస్తోంది.
* భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కొవిడ్-19 బారినపడ్డారు. దీంతో ఆయన హోం ఐసోలేషన్లోకి వెళ్లారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు. కొవిడ్‌కు సంబంధించిన లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించగా తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని నడ్డా తెలిపారు. తన ఆరోగ్యం బాగానే ఉందని పేర్కొన్నారు. వైద్యుల సలహా మేరకు కొవిడ్ మార్గదర్శకాలను అనుసరించి ఇంట్లోనే ఉంటున్నానని చెప్పారు. తనను కొద్ది రోజులుగా కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
* నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ సోమవారం తలపెట్టిన దేశవ్యాప్త ఆందోళనకు రైతు సంఘాలు సిద్ధమయ్యాయి. ఈ ఆందోళనలో భాగంగా రైతు సంఘాల నేతలు ఒక్కరోజు నిరాహార దీక్షలో పాల్గొననున్నారు. దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న ప్రాంతాల్లోనే నిరాహార దీక్ష చేయనున్నట్లు నేతలు తెలిపారు. సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నేతలు నిరాహార దీక్షల్లో పాల్గొంటారని రైతు నేత గుర్నామ్‌సింగ్ చదునీ తెలిపారు. దేశవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
* బాలీవుడ్ నటుడు సోనూసూద్ మరోసారి తన పెద్దమనసును చాటుకున్నాడు. ఇప్పటికే వలస కార్మికులను ఆదుకుంటున్న సోనూ.. తాజాగా మరోసారి పేదలకు సాయం చేసేందుకు ముందుకొచ్చాడు. కరోనా మహమ్మారి కారణంగా జీవనోపాధి కోల్పోయిన నిరుపేదలకు ఇ-రిక్షాలను అందించనున్నట్లు ప్రకటించాడు. ఖుద్ కమావో, ఘర్ చలావో పేరుతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపాడు. ‘గత కొన్ని నెలలుగా ఎంతో మంది తనపై ఎంతగానో ప్రేమను కురిపించారని, అదే ఇప్పుడు తన సేవా కార్యక్రమాలను కొనసాగించేలా ప్రేరేపిస్తున్నాయని’ సోనూ చెప్పాడు.
* బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వచ్చేందుకు హింసాత్మక ఘటనల్ని ప్రోత్సహిస్తున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయవర్గీయ ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ హింసకు తెరపడాలంటే వెంటనే కేంద్ర బలగాలను దింపాలని ఆయన డిమాండు చేశారు. ఈ మేరకు ఆయన బీర్భూమ్లోని శాంతినికేతన్ వద్ద ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎలాంటి హింసకు తావులేకుండా నిర్వహించాలని ఈసీని కోరామన్నారు.
* మెదడులో కణితితో బాధపడుతున్న తొమ్మిదేళ్ల చిన్నారికి వినూత్నరీతిలో శస్త్రచికిత్స జరిగిన సంఘటనిది. ఓ వైపు కణితిని తొలగించటంలో వైద్యులు నిమగ్నమైతే మరోవైపు పియానో వాయించింది ఆ చిన్నారి. వివరాల్లోకి వెళితే…. మధ్యప్రదేశ్‌లోని మొరైనా జిల్లా బాన్మూర్కు చెందిన తొమ్మిదేళ్ల సౌమ్య మెదడుకు సంబంధించిన వ్యాధితో బిర్లా ఆసుపత్రిలో చేరింది. ఆమె మెదడులో కణితి ఉన్నట్లు అక్కడి వైద్యులు నిర్ధరించారు. శస్త్రచికిత్స నిర్వహించాలని నిర్ణయించారు. చికిత్స చేసే సమయంలో మూర్ఛపోకుండా ఉండేందుకు పియానో వాయించాలని బాలికకు సూచించారు.