రాదారి ప్రమాదాల్లో మృతులు అత్యధికులు మధుమేహులే

మద్యం తాగడం, ఆత్మహత్యలు చేసుకోవడం, రోడ్డు ప్రమాదాలకు గురి కావడం వల్ల మృతి చెందుతున్న వారిలో మధుమేహంతో బాధపడని వారి కంటే దాని బారిన పడ్డ వారే అధికంగా ఉన్నారని ఓ పరిశోధనలో తేలింది. ‘మధుమేహం ఉన్నవారు మానసిక సమస్యల బారిన కూడా పడతారని మనకు తెలుసు. ప్రతిరోజు ఇన్సులిన్‌ తీసుకోవడం వల్ల వారి దైనందిక జీవనశైలిలోనూ మార్పులు కనపడతాయి. ఆహారపు అలవాట్లు, నిద్ర, శరీర కదలికలు వంటివి రక్తంలో గ్లూకోజు స్థాయిపై ప్రభావం చూపుతుంది’ అని ఫిన్లాండ్‌లోని హెల్సింకీ విశ్వవిద్యాలయ ఆచార్యుడు లియో నిస్కనెన్‌ తెలిపారు. ‘మధుమేహం ఉన్నవారు ఒత్తిడి, ఆందోళనలకు గురి కావడం వల్ల హృద్రోగ, కిడ్నీ వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంటుంది. వీటి వల్ల కూడా మానసిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. టైప్‌-1, టైప్‌-2 మధుమేహం ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రబలంగా ఉంది. వాటివల్ల ప్రతి ఏడాది లక్షలాది మంది మృతి చెందుతున్నారు’ అని లియో చెప్పారు. తమ పరిశోధనల ఫలితాల గురించి యూరోపియన్‌ జర్నల్‌ ఆఫ్‌ ఎండోక్రినాలజీలో ఆయన పేర్కొన్న ప్రకారం… మద్యం అధికంగా తాగడం, ఆత్మహత్య ఆలోచనలు, రోడ్డు లేదా ఇతర ప్రమాదాలకు గురి కావడం వల్ల మృతి చెందుతున్న వారిలో మధుమేహంతో బాధపడుతున్న వారే అధికంగా ఉన్నారు. ఈ మూడు కారణాల వల్ల మృతి చెందిన నాలుగు లక్షల మందిపై పరిశోధనలు జరపగా ఈ విషయం వెల్లడైంది. ‘మధుమేహంతో బాధపడుతున్న వారిలో ఆత్మస్థైర్యం పెరిగేలా, ఒత్తిడి తగ్గేలా తోడ్పాటునందించాలి. మధుమేహులు చాలా ఒత్తిడికి గురవుతున్నట్లయితే లేదా మద్యం అధికంగా తాగుతున్నట్లయితే ఆ విషయాలను వైద్యుడికి చెప్పడంలో మెహమాటపడకూడదు’ అని లియో పేర్కొన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com