కాల్చిన పసుపు కొమ్ముల చూర్ణంతో దంత ఆరోగ్యం

దంతరోగాల నివారణా ఔషదములు
🌿🍃🌱🌴☘🍀🍂🍋🍏🍐🍌🍇🍓🍈🍒🍍
🔹అక్కలకర్ర కషాయం పుక్కిలించిన దంతరోగములు తగ్గును.

🔸అరటిపండు తొక్కలు నోటిలో వేసుకొని నమిలిన పంటినొప్పులు తగ్గును.

🔹నారింజ తొక్కలు నోట్లో వేసుకొని నములుట వలన దంతరోగములు పోవును.

🔸ఎర్ర ఆవాల చూర్ణంలో ఉప్పు కలిపి తోముచున్న దంత సమస్యలు పోవును .

🔹కొత్తిమీర ఆకులు నములుచున్న నోటిలో పుండ్లు పోవును .

🔸కరక్కాయల బెరడు చూర్ణం 10 గ్రాములు , పోకచెక్క చూర్ణం 5 గ్రాములు , పటికపొడి 5 గ్రాములు , ముద్దకర్పూరం 3 గ్రాములు కలిపి పండ్లపొడిగా వాడుచున్న దంత సమస్యలు తొలగును.

🔹కానుగచెట్టు పుల్లతో పండ్లు తొముచున్న దంత సమస్యలు మరియు నోటిపూత పోవును .

🔹కర్పూరతైలం దంతములకు పట్టిస్తుచున్న దంతములు గట్టిపడును.

🔹 తెల్లతుమ్మచెక్క , మద్దిచెక్క , శొంఠి కషాయం కాచి ఆ కషాయం 4 నుంచి 5 దినాలు పుక్కిలించుచున్న కదిలిన దంతములు గట్టిపడును.

🔸నేరేడు ఆకుల రసం పుక్కిలించిన ఉబ్బి మెత్తబడిన చిగుళ్లు గట్టిపడును.

🔹 నీరుల్లి మెత్తగా నూరి ఆ గుజ్జుతో దంతధావనం చేసిన చిగుళ్ల రక్తం చీము తగ్గును.

🔹 నిమ్మతొక్కల పొడితో దంతదావనం వలన దంతములు తెల్లబడును.

🔸నిమ్మరసంతో బాగుగా నోటిని పుక్కిలించుచున్న దంతములు శుభ్రపడును.

🔹పటిక నీటిని పుక్కిట పట్టి కొంచంసేపు ఉంచిన చిగుళ్ల వాపు , దంతాలు కదులుట తగ్గును.

🔸పసుపు కొమ్ములను నిప్పులపై కాల్చి చూర్ణం చేసి ఆ చూర్ణంతో పళ్ళుతోమిన దంతవ్యాధులు తగ్గును.

🔹పళ్ళ వెంట రక్తం పడుతున్న ఆవాలు , జీలకర్ర, ఉప్పు కలిపి నూరి ఆ చూర్ణంతో దంతములను తోమవలెను .

🔸మామిడి చిగుళ్ల వేడి కషాయం పుక్కిలించిన పళ్లనొప్పులు తగ్గును.

🔹 మర్రి ఊడలతో దంతదావనం చేయుచున్న దంతరోగాలు పోవును .

🔸 దానిమ్మ కాయ బెరడు కషాయం పుక్కిట పట్టి ఉంచిన చిగుళ్ల వాపు తగ్గును.

🔹 కరక్కాయ చూర్ణంతో పళ్ళు తోమిన శుభ్రముగా ఉండును. కాంతివంతంగా మృదువుగా ఉండును.🌹💫🌾🍃🌿🌴🌷🌱🌼🌺🌸🌻

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com