వెబ్ సిరీస్ వైపు

‘సూయీ దాగ’ చిత్రంలో భర్తకు అండగా నిలిచే ఓ మధ్యతరగతి మహిళ పాత్రలో నటించి మెప్పించారు బాలీవుడ్ బ్యూటీ అనుష్కా శర్మ. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ జోష్లో ఉన్న అనుష్క డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టనున్నారు. కొన్నేళ్ల క్రితం ‘ఎన్హెచ్10’ అనే థ్రిల్లర్ చిత్రంతో అనుష్క నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమె నిర్మించిన ‘ఫిలౌరి’, ‘పరి’ చిత్రాలు ఆశించిన విజయం అందుకోలేకపోయాయి. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కానున్న ఈ వెబ్సిరీ్సకు నిర్మాతగా వ్యవహరించినున్నారు అనుష్క. ‘ఎన్హెచ్ 10’, ‘ఉడ్తా పంజాబ్’ చిత్రాలకు సహ రచయితగా పనిచేసిన సుదీప్ శర్మ ఈ చిత్రానికి సహనిర్మాత, దర్శకుడు. ఓ నేరాన్ని పరిష్కరించే క్రమంలో ఓ పోలీసు అధికారికి ఎదురయ్యే సంఘటనల నేపథ్యంలో ఈ వెబ్సిరీస్ రూపొందనుంది. మొత్తం పది ఎపిసోడ్లు ఉండే తొలి సీజన్ షూటింగ్ ఈ ఏడాది ఆఖరులో ప్రారంభమవుతుంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com