నోట్లోకి పెట్టుకునేదాని బట్టి ఆలోచనలు ఉంటాయి

మన శారీరక ఆరోగ్యానికి మానసిక ఆరోగ్యానికి సంబంధం ఉంది. అంతేకాదు…. మనం తీసుకునే ఆహారం, చేసే పనులు మన మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. అదెలాగంటే…
*పోషకాహారం
ప్రాసెస్డ్ ఫుడ్ అపరిమితంగా తినడం, మైక్రోన్యూట్రియంట్ల లోపం ప్రభావం వల్ల యాంగ్జయిటీ, డిప్రెషన్లు పెరుగుతాయి.
హైడ్రేషన్: శరీరంలో నీటి తరుగుదల కాగ్నిటివ్ ఇంపెయిర్మెంట్కు దారి తీస్తుంది. క్షణక్షణానికీ మూడ్స్ మారిపోతూ ఉండడం, చిత్తభ్రమ లాంటి వాటికి లోనయ్యే ప్రమాదం ఉంటుంది.
*వ్యాయామం
ఒత్తిడి, ఆందోళన, నిరాశానిస్పృహలను తగ్గించే గుణం వ్యాయామానికి ఉంటుంది. ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరగాలన్నా క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
నిద్ర: డిప్రెషన్, బైపోలార్ డిజార్డర్, యాంగ్జయిటీ డిజార్డర్, ఎడిహెచ్డిలకు నిద్రలేమికి సంబంధం ఉంది. మానసిక సమతౌల్యం సమకూరాలన్నా, భావోద్వేగాలు ఆదుపులో ఉండాలన్నా రోజుకి కనీసం 6 నుంచి 8 గంటలపాటు నిద్ర పోవాలి.
*మత్తుపదార్థాలు
డిప్రెషన్, ఒత్తిడులను తగ్గించుకోవడం మద్యపానం లాంటి మత్తుపదార్థాలకు అలవాటు పడితే, తాత్కాలిక ఉపశమనం కలిగినట్టు అనిపించినా, అవి అంతర్లీనంగా మానసిక వ్యాధులను కలుగజేస్తాయి.
*రుగ్మత
రుగ్మత ప్రభావం మనసు మీద కచ్చితంగా పడుతుంది. రుగ్మత కలిగించే ఇబ్బందులు, అసౌకర్యాలు డిప్రెషన్కు లోను చేస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి కుంగదీస్తాయి.
*అల్పాహారం
అల్పాహారం మానకూడదు. మెదడు చురుగ్గా పనిచేయాలంటే ఉదయం నిద్ర లేచిన రెండు గంటల్లోగా అల్పాహారం తినేయాలి. మాంసకృత్తులు ఎక్కువగా, పిండిపదార్థాలు మధ్యస్థంగా, కొవ్వులు అతి తక్కువగా ఉండే అల్పాహారం ఎంచుకోవాలి.
*తీపికి దూరం
మన శరీరానికి చక్కెర అవసరం లేదు. చక్కెర మెదడును మొద్దుబారుస్తుంది. చురుకుదనం, జ్ఞాపకశక్తి, ఏకాగ్రతలు చక్కెర వినియోగంతో తగ్గుతాయి. కాబట్టి తీపి తినాలనిపిస్తే తాజా పళ్లను మాత్రమే ఎంచుకోవాలి. తేనె, బెల్లం కూడా తీపికి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు కావు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com