ఇక అలహాబాద్ పేరు ప్రయాగ్ రాజ్

ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ప్రముఖ నగరం అలహాబాద్‌ పేరును ప్రయాగ్ రాజ్‌గా యోగి ఆదిత్యానాథ్‌ సర్కార్ మంగళవారం మార్చేసింది. ఈ మేరకు పేరు మారుస్తూ.. యోగి కేబినెట్‌ తీర్మానం చేసింది. యోగి సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇది ఒక రాజకీయ జిమ్ముక్కు అని, బలవంతంగా హిందూత్వ ఎజెండాను ప్రజలపై రుద్దుతున్నారని ప్రతిపక్ష ఎస్పీ, కాంగ్రెస్‌ పార్టీలు మండిపడ్డాయి. మరోవైపు మేధావులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల ఈ నిర్ణయంపై మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే బీజేపీ ఇలాంటి జిమ్మిక్కులకు పాల్పడుతోందని విమర్శలు వస్తున్నాయి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com