USCISపై ఐటీసర్వ్ దావా

అమెరికాలోని ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీ యూఎస్సిఐఎస్ పై ఐటా కంపెనీల బృందం దావా వేసింది. ఈ ఐటీ కంపెనీల బృందంలో అమెరికాలోని వెయ్యికి పైగా చిన్న ఐటీ కంపెనీలు ఉన్నాయి. వీటిలో ఎక్కువ కంపెనీలను భారత సంతతికి చెందినా వ్యక్తులే నడిపిస్తున్నారు. అమెరికా ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీ హెచ్-1బీ వీసాల పై మూడేళ్ళ కంటే తక్కువ కాలపరిమితి విధిస్తోందని కంపెనీల బృందం ఫిర్యాదు చేసింది. చాలా తక్కువ కాలానికి వీసా ఇస్తోందటూ దావా వేసింది. హెచ్ 1బీ వీసా ద్వారా విదేశేయులకు అమెరికాలోని ఐటీ కంపెనీలు ఉద్యోగాలు ఇవ్వొచ్చు. ఈవీసల ఆధారంగా వేలాది మంది భారతీయులు చైనీయులు ఇతర దేశాల వారు అమెరికాలోని కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్న సంగతి తెలిసిందే. సాధారణంగా ఈ వీసాలను మూడు నుంచి ఆరేళ్ళ కాలానికి ఇస్తారు. ఈ వ్యవధిలో వారు అమెరికాలో ఉద్యోగం చేసుకోవచ్చు. అయితే ఇటీవల మూడేళ్ళ కంటే తక్కువ కాలపరిమితితో వీసాలు ఇస్తున్నారు. దీంతో టెక్సాస్‌లోని డల్లాస్‌లో ఉన్న ఐటీ సర్వ్‌ అలియన్స్‌ అమెరికా పౌర, వలస సేవల విభాగం(యూఎస్‌సీఐఎస్‌)పై దావా వేసింది. ప్రస్తుతం ఉన్న నిబంధనలను మార్చడానికి, వీసా గడువును తగ్గించడానికి యూఎస్‌సీఐఎస్‌కు అధికారం లేదని ఐటీ సర్వ్‌ అలియన్స్‌ ఆరోపిస్తోంది. అమెరికా కాంగ్రెస్‌ ప్రత్యేకంగా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ లేబర్(డీఓఎల్‌)‌కు అధికారాలిచ్చిందని, డీఓఎల్‌ నిబంధనల ప్రకారం మూడేళ్ల అనుమతి ఇవ్వాలని తెలిపింది. ఐటీ కంపెనీలు యూఎస్‌సీఐఎస్‌పై వేసిన రెండో దావా ఇది. 2018 జులైలో మొదటి దావా వేశాయి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com