చిరంజీవి జనసేనలోకి వస్తారేమో!

సినీనటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన చిరంజీవి అప్పటి నుంచి ఆ పార్టీ నేతగానే కొనసాగుతున్నారు. రాజ్యసభకు ఎన్నికై కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. అనంతరం రాష్ట్ర విభజన జరగడం, కాంగ్రెస్‌ పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలతో ఆ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే సినిమాలతో బిజీగా మారారు. 150వ చిత్రం ‘ఖైదీ నం.150’తో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిరంజీవి… ప్రస్తుతం స్వాతంత్ర్య సమరయోధుడు సైరా నరసింహారెడ్డి బయోపిక్‌ ‘సైరా’లో నటిస్తున్నారు. ఆ తర్వాత కూడా ఆయన మరిన్ని సినిమాల్లో నటించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల చిరంజీవి కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వ కాలపరిమితి ముగియగా.. దాన్ని పునరుద్ధరించుకోలేదు. దీంతో ఆయన ఆ పార్టీకి దూరమైనట్లేనని తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున పార్టీలో క్రియాశీలకంగా ఉండాలని ఇటీవల రాహుల్‌గాంధీ.. చిరంజీవిని కోరినట్లు తెలుస్తోంది. దీనికి ఆయన నుంచి స్పందన లేనట్లు సమాచారం. దీంతో ఆయన కాంగ్రెస్‌ పార్టీకి ఇక దూరమైనట్లేనని భావిస్తున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com