జంబోకు శుభాకాంక్షలు వెల్లువ

ఒకే టెస్టు ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీసిన రెండో బౌలర్‌ అనిల్‌ కుంబ్లే. అదీ పాకిస్థాన్‌పై సాధించడం మరెంతో గర్వకారణం. ఆటగాడిగా, సారథిగా, కోచ్‌గా భారత్‌కు తిరుగులేని విజయాలు అందించారు. ఈ స్పిన్‌ దిగ్గజం బుధవారం 48వ వసంతంలోకి అడుపెట్టారు. ఈ సందర్భంగా జంబోకి మాజీలు, స్నేహితులు, అభిమానులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. సచిన్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌, వీరేంద్ర సెహ్వాగ్‌, హర్భజన్‌ సింగ్‌, వినోద్‌ కాంబ్లి, ఆకాశ్‌ చోప్రా, శిఖర్‌ ధావన్‌ తదితరులు తమ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. టీమిండియా తరఫున కుంబ్లే 132 టెస్టులు, 271 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 619 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com