కేసీఆర్…లక్ష ఇళ్ళు ఎక్కడ?

పాక్షిక మేనిఫెస్టో అంటూ తెరాస అధినేత, సీఎం కేసీఆర్ సరికొత్త మోసానికి దిగారని ‌భాజపా సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి విమర్శించారు. గతంలో ఇచ్చిన హామీలకే దిక్కులేదని ఆయన మండిపడ్డారు. 2017 నాటికి హైదరాబాద్‌ నగరంలో లక్ష ఇళ్లు కట్టకపోతే ఓట్లు అడగనన్నారని.. ఇప్పుడేమైందని కిషన్‌రెడ్డి ఘాటుగా ప్రశ్నించారు. ముందస్తు ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్‌, తెరాస ఆచరణ సాధ్యం కాని హామీలతో ప్రజలను మధ్యపెడుతున్నాయని ఆయన దుయ్యబట్టారు. ఆ రెండు పార్టీలు గతంలో హామీల అమలులో పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు. విభజన సమయంలో వచ్చిన రూ.63వేల కోట్ల అప్పులను కేసీఆర్‌ సర్కారు రూ.లక్షా 70 వేల కోట్లకు తీసుకెళ్లిందని మండిపడ్డారు. దేశంలో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి దయనీయంగా ఉందని, ఆ పార్టీ ఉచ్చులో తెరాస పడిందని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఓట్లు, సీట్లు, అధికారం మీదే తెరాస, కాంగ్రెస్‌ దృష్టి పెట్టాయని ఆయన విమర్శించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com