NRI-NRT

బ్రిటన్ ప్రవాసులకు నిద్ర పట్టడం లేదంట!

బ్రిటన్ ప్రవాసులకు నిద్ర పట్టడం లేదంట!

బ్రిటన్‌లో ఉంటున్న భారత జాతీయుల మానసిక ఆరోగ్యంపై కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం చూపిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ‘ఆఫీస్‌ ఫర్‌ నేషనల్‌ స్టాటస్టిక్స్‌’‌ (ఓఎన్‌ఎస్‌) అధికారిక గణాంకాల విశ్లేషణ ఆధారంగా వారీ నిర్ధారణకు వచ్చారు. కొవిడ్‌-19 ఆరంభంలో లాక్‌డౌన్‌ విధించినప్పుడు.. తాము ఆందోళనకు గురవుతున్నామని, సరిగా నిద్ర పట్టడం లేదంటూ చాలామంది మానసిక నిపుణులను, హెల్ప్‌ సెంటర్లను సంప్రదించారు. ఇలాంటి వారిలో మిగతా జాతీయుల కంటే భారతీయులే అధికంగా ఉండటం గమనార్హం. ఆందోళనకు గురైనవారిలో 36% భారత జాతీయులు కాగా, 23% బ్రిటన్‌ తెల్లజాతీయులు, 18% ఇతర జాతులకు చెందినవారు ఉన్నారు. సంపాదన, పొదుపు, ఇతర ఆర్థిక విషయాలు వారి మానసిక ఆందోళనకు ప్రధాన కారణాలని విశ్లేషించారు. ‘‘లాక్‌డౌన్‌ తొలి రోజుల్లో అన్ని వర్గాలకూ ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. 58% భారతీయులు మాత్రం ఆస్తులపై ఆధారపడి నష్టం నుంచి త్వరగా కోలుకున్నారు’’ అని సస్టెయినబిలిటీ అండ్‌ ఇనీక్వాలిటీస్‌ విభాగ డిప్యూటీ డైరెక్టర్‌ గ్లెన్‌ ఎవరెట్‌ పేర్కొన్నారు.