Health

అధిక బరువు తగ్గించే పండు

Papaya Helps Loose Weight - Telugu Health News

బొప్పాయిలో ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. సి- విటమిన్‌తో పాటు యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి. ఇవి రక్తనాళాలలో కొలెస్ట్రాల్‌ పేరుకుపోవడాన్ని నిరోధిస్తాయి.అధిక బరువుతో బాధపడుతున్న వారు బొప్పాయి తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. క్యాలరీలు తక్కువగా, ఫైబర్‌ ఎక్కువగా ఉండే బొప్పాయి తీసుకోవడం వల్ల పొట్ట నిండిన ఫీలింగ్‌ కలుగుతుంది.ఇన్‌ఫెక్షన్ల బారినపడకుండా రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ బొప్పాయి ఎంతగానోఉపయోగపడుతుంది.మధుమేహంతో బాధపడేవారికి ఇది మంచి ఆహారం. బొప్పాయిలో చక్కెర శాతంతక్కువగా ఉంటుంది.ఆర్థరైటి్‌సతో భాదపడే వారు బొప్పాయి తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు నొప్పుల నివారణలో తోడ్పడతాయి.బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియెంట్లు, ఫ్లావనాయిడ్లు ఉంటాయి. ఇవి కోలన్‌ కేన్సర్‌, ప్రొస్టేట్‌ కేన్సర్‌ వచ్చే అవకాశాలను బాగా తగ్గిస్తాయి.ఒత్తిడిని తగ్గించడంలోనూ బొప్పాయి ఉపయోగపడుతుంది. ఒత్తిడికి కారణమయ్యే హార్మోన్లను నియంత్రించడంలో బొప్పాయి కీలకపాత్ర పోషిస్తుందని ఒక అధ్యయనంలో వెల్లడయింది.