ఉమ్మడి ఏపీ మాజీ గవర్నర్ ఎన్.డీ.తివారి కన్నుమూత

ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ సీఎంగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా పనిచేసిన ఎన్డీ తివారి గురువారం కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన దిల్లీ సాకేత్‌లోని మ్యాక్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. జ్వరం, న్యుమోనియాతో బాధపడుతూ మధ్యాహ్నం 2.50 గంటలకు కన్నుమూసినట్టు వైద్యులు వెల్లడించారు. 1925 అక్టోబర్‌ 18న ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌జిల్లా బాలూటి గ్రామంలో జన్మించిన తివారి పూర్తి పేరు నారాయణ దత్‌ తివారి. ప్రస్తుతం ఆయన వయస్సు 92 ఏళ్లు. ఈ రోజు ఆయన తన 93వ వసంతంలోకి అడుగుపెట్టిన వేళ అస్తమయం కావడం గమనార్హం. 2007 19న ఏపీ గవర్నర్‌గా నియమితులైన తివారి 2009 డిసెంబర్‌ మాసంలో తన పదవికి రాజీనామా చేశారు. సీనియర్‌ రాజకీయ నాయకుడైన తివారి రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా పనిచేసిన భారతీయుడిగా ఘనత సాధించారు. ఉత్తర్‌ ప్రదేశ్‌కు మూడు పర్యాయాలు (1976- 77, 1984-85, 1988-89), 2002 నుంచి 2007 వరకు ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రిగా ఆయన సేవలందించారు. పనిచేశారు. 1986 నుంచి 1987 వరకు మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ కేబినెట్‌లో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగానూ పనిచేశారు. అంతేకాకుండా పరిశ్రమలు, పెట్రోలియం శాఖలకుమంత్రిగా, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగానూ బాధ్యతలు నిర్వహించారు. అలహాబాద్‌ విశ్వవిద్యాలయంలో ఎంఏ, ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసిన తివారి.. ఆగ్లేయుల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన భారత స్వాంత్ర్య పోరాటంలో పాల్గొని జైలుకెళ్లారు. తొలుత ప్రజాసోషలిస్టు పార్టీలో పనిచేసిన తివారి ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. 1994లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి అర్జున్‌సింగ్‌తో కలిసి ఆల్‌ ఇండియా ఇందిరా కాంగ్రెస్‌ స్థాపించారు. అనంతరం సోనియా గాంధీ సమక్షంలో తిరిగి కాంగ్రెస్‌లో చేరారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com