నాకే పాపం తెలీదు

బాలీవుడ్‌నటి తనుశ్రీ దత్తా చేసిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలంటూ సీఐఎన్‌టీఏఏ నుంచి జారీ అయిన నోటీసుకు నటుడు నానాపటేకర్‌ స్పందించారు. ఆ నోటీసుకు పూర్తి వివరణను ఆయన పంపించారు. తనుశ్రీదత్తా చేసిన ఆరోపణలు పూర్తిగా తప్పుడువి, నిరాధారమైనవని తన వివరణలో పేర్కొన్నారు. తనుశ్రీపై చట్టపరంగా చర్యలు తీసుకోనున్నట్లు ఆయన వెల్లడించారు. పదేళ్ల క్రితం జరిగిన ఓ సినిమా షూటింగ్‌ సందర్భంగా నానాపటేకర్‌ తనతో అసభ్యంగా ప్రవర్తించారని తనుశ్రీదత్తా ఆరోపించింది. దీనిపై ఇప్పటికే పరిణితీ చోప్రా, ప్రియాంక చోప్రా, ట్వింకిల్‌ ఖన్నా, శిల్పాశెట్టి, డింపుల్‌ కపాడియా, ఫర్హాన్‌ అక్తర్‌ తదితరులు తనుశ్రీకి మద్దతుగా నిలిచారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com