ఖమ్మం జిల్లాలో నామా-తుమ్మల వర్గాల మధ్య తీవ్ర పోరు

తెలంగాణలో తెదేపా అంతో ఇంతో బలంగా ఉందని చెప్పుకుంటున్న జిల్లలో ఖమ్మం జిల్లా ఒకటి. ఆ జిల్లా నుంచి నామా నాగేశ్వరరావు, సండ్ర వెంకట వీరయ్యతో పాటు మరికొంత మంది నేతలు తెదేపా కోసం గట్టిగానే పని చేస్తున్నారు. నామా నాగేశ్వరరావు పార్లమెంట్ పైనే గురి పెట్టినప్పటికీ ఇప్పుడు ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాబోతున్నరనే ప్రచారం ఉపందుకుంటోంది. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన పువ్వాడ అజయ్ గెలుపొందారు. అప్పట్లో తెదేపా అభ్యర్ధిగా పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావు ఓడిపోయారు. ఈసారి అజయ్ టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్-తెదేపా మధ్య పొత్తు ఖాయం కావడంతో.. ఖమ్మం నుంచి పోటీ చేసేందుకు తెలుగుదేశం పార్టీ సిద్దమవుతోంది. మహాకూతమిలో సీట్ల సర్దుబాటులో భాగంగా ఖమ్మంజిల్లా లో ఖమ్మం అసెంబ్లీతో పాటు వైరా, సత్తుపల్లి నియోజకవర్గాలు కేటాయించాలని తెదేపా నేతలు కోరుతున్నారు. వైరా సంగతి ఎలా ఉన్నా ఖమ్మం, సత్తుపల్లి నియోజకవర్గాలు వదిలిపెట్టే ప్రసక్తే లేదని తెదేపా నేతలు చెబుతున్నారు. తెదేపాకి ఖమ్మం సీటు కేటాయిస్తే అందరూ నామా నాగేశ్వరరావునే బరిలో దిగమని కోరుతున్నారు. పార్టీ సమావేశాల్లో నామా పై తీవ్ర స్థాయిలో నేతలు ఒత్తిడి తెస్తున్నారు.
**ఖమ్మంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అజయ్ ముందు అంతంత మాత్రంగా ఉన్న వాళ్ళు నిలబడటం కష్టం. అంగ, ఆర్ధిక బలాలు ఉంటేనే, అజయ్ ని తట్టుకో గలుగుతారు. కాంగ్రెస్ పార్టీలో బలమైన అభ్యర్ధి లేరు. తెదేపాలో కూడా నామానే అజయ్ కు సరైన జోడిగా భావిస్తున్నారు. నామా మాత్రం ఖమ్మం పార్లమెంట్ కు పోటీ చేయాలనే యోచనలో ఉన్నారు. గత ఎన్నికల్లో చాలా స్వల్ప తేడాతోనే నామా ఓటమి పాలయ్యారు. ఈసారి గెలుపు ఖాయమని ఆయన నమ్మకంతో ఉన్నారు. అయితే ఎన్నికల సన్నాహాలు మాత్రం ఖమ్మంలో తెదేపా జోరుగానే నిర్వహిస్తోంది. బూట్ కమిటీలను ఏర్పాటు చేసుకున్నారు. కొత్త ఒఅతర్లను నమోదు చేస్యిస్తున్నారు మొత్తానికి ఈసీటు తెదేపాకి కేటాయిస్తే బరిలోనే ఉండేది మాత్రం నమనే అని అక్కడి తెదేపా కార్యకర్తలు గట్టి నమ్మకంతో ఉన్నారు.
*****సత్తుపల్లి మీద తుమ్మల కంగారుకు కారణమేంటి?
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తెరాస నేత తుమ్మల నాగేశ్వరరావు కార్యకర్తలతో మాట్లాడుతూ ఎ ఎన్నికల్ని అశామశిగా తీసుకోవద్దని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కి తానూ మతిచ్చానని జిల్లాలో అన్ని సీట్లు గెలవడం ఎంత ముఖ్యమో సత్తుపల్లి నియోజకవర్గం అంతకంటే ముఖ్యమని తుమ్మల చెప్పారు. ఒకవేళ మీరు ఆషామాషీ తీసుకుంటే మీ మనిషి తుమ్మల నాగేశ్వరరావు వచ్చే క్యాబినెట్ లో ఉండదు. కాబట్టి అది మీరందరూ గమనించాలి. అది నేను ఎంత అవసరంగా చెప్తున్నానో మీరు గుర్తు చేసుకోవాలి అన్నారు.
**జిల్లలో నియ్జకవర్గాల్ని ఒకెత్తు అయితే.. సత్తుపల్లి మాత్రం మరోకేట్టు. దానిపై చాలా శ్రద్ద పెట్టాలని తుమ్మల ఎందుకు అంత ఇదిగా చెప్తున్నట్లు అనే అనుమానం కలుగుతోంది. కదా? గతంలో ఆయన మూడుసార్లు సత్తుపల్లి నుంచి గెలిచారు. ప్రస్తుతం పాలేరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఇప్పుడు సత్తుపల్లి మీద వహిస్తున్నారు. అయితే ఇప్పుడు సత్తుపల్లి మీద ప్రత్యెక దృష్టికి కారణం అక్కడ తెదేపా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో మళ్ళీ సత్తుపల్లి నుంచే సండ్ర పోటీ చేయడం దాదాపు ఖాయం పైగా ప్రస్తుతం టీడీపీకి అక్కడ మంచి పట్టు ఉంది. పైగా చంద్రబాబుకి సండ్ర తిరుగులేని శిస్యుడనే ఇమేజ్ ఉండడంతో ఇక్కడ తెరాస ప్రత్యెక దృష్టి పెట్టినట్టు చెప్పుకోవచ్చు.
**తుమ్మల వ్యాఖ్యల్లో కొంత బెదిరింపు ధోరణి కూడా కనిపిస్తోంది దానికి కారణం లేకపోలేదు. ప్రస్తుతం అక్కడ తెరాసలో ఉన్న చాలా మంది గతంలో తెదేపా నుంచి వలస వచ్చినవారే కాబట్టి. రాబోయే ఎన్నికల్లో వారంతా మరోసారి తెదేపా వైపు పరిస్థితి రాకూడదని ఇది తన ప్రతిష్టకు సంబందించిన అంశమని రాష్ట్రంలో తన ఇజ్ఞాత్ కా సవాల్ అన్నట్లుగా కార్యకర్తలకూ ఇతర నేతలకూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారని చెప్పొచ్చు. నిజానికి ఖమ్మలో తెదేపాకి మొదట్నుంచి మంచి పట్టుంది. అందుకే ఇప్పుడీ జిల్లా బాధ్యతల్ని ముఖ్యమంత్రి కేసీఆర్ తుమ్మల కి ఇచ్చారు. అన్ని సీట్లు గెలవడం ఒకెత్తు అనేది కూడా తుమ్మలకి కేసీఆర్ నిర్దేశించిన కీలక లక్ష్యంగా కనిపిస్తోంది తుమ్మల కూడా సత్తుపల్లి నియోజకవర్గానికి చెందినవారే కదా. ఆయన కూడా తెదేపా నుంచి తెరాసకు వలస వచ్చినవారే ఆయన వచ్చేసరేమోనని తెదేపా కేడర్ ఇంకా బలంగా ఉండనే నమ్మకం ఆయనకీ ఉందని తాజా వ్యాఖ్యల ద్వారా తుమ్మల చెబుతున్నట్లుగానూ అనుకోవచ్చు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com