50వేల మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం

గత ఏడాది అగ్రరాజ్యం అమెరికా.. సుమారు 50 వేల మంది భారతీయులకు పౌరసత్వాన్ని ఇచ్చింది. ఇది 2016 కన్నా నాలుగు వేలు ఎక్కువ అని రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. గత ఏడాది 50 వేల 802 మంది భారతీయులకు పౌరసత్వం ఇచ్చినట్లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూర్టీ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. 2016లో మొత్తం 46 వేల 188 మందికి పౌరసత్వం దక్కింది. 2015లో ఆ సఖ్య 42 వేల 213గా ఉంది. అయితే గత ఏడాది అమెరికా పౌరసత్వం తీసుకున్న విదేశీయుల సంఖ్య ఏడు లక్షలు దాటింది. అత్యధికంగా సిటిజషన్‌షిప్ తీసుకున్నవారిలో మెక్సికన్లు ఉన్నారు. రెండవ స్థానంలో ఇండియా, మూడవ స్థానంలో చైనా ఉన్నాయి. ఆ తర్వాత స్థానాల్లో పిలిప్పీన్స్, డామినికన్ రిపబ్లిక్, క్యూబా దేశాలు ఉన్నాయి. భారత్ నుంచి పౌరసత్వం పొందిన వారిలో సుమారు 12 వేల మంది కాలిఫోర్నియాలో సెటిల్ అయ్యారు. న్యూజెర్సీలో 5900, టెక్సాస్‌లో 3700 మంది భారతీయులు సెటిలయ్యారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com