మహీంద్రా ముచ్చట పడిన వేళ

బిజినెస్ టైకూన్ మహీంద్రా అండ్ మహీంద్రా ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా తన పేరును ‘గార్బింద్రా’గా మారుస్తారేమోనని భయపడుతున్నారు. ఆయన షేర్‌ చేసిన వీడియోలను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. దేవీ నవరాత్రుల సందర్భంగా ప్రజలందరూ గర్బా నృత్యాలు చేస్తూ ఆనందంలో మునిగిపోతున్నారు. దానిలో భాగంగా న్యూయార్క్‌లో నవరాత్రి వేడుకల్లో భాగంగా అక్కడి ప్రజలు కొందరు ఈ నృత్యం చేశారు. అయితే ఆ డ్యాన్స్‌లకు స్థానిక పోలీసులు కాలు కదపడం విశేషం. ఇందుకు సంబంధించిన వీడియో ఆనంద్ మహీంద్రాను అమితంగా ఆకట్టుకుంది. వెంటనే దాన్ని ఆయన ట్విటర్ ద్వారా నెటిజన్లతో షేర్‌ చేసుకున్నారు. అంతేకాకుండా దానికి కొంత కామెడీ కూడా జత చేశారు. ‘నేను ఇప్పటికే అనేక గర్బా వీడియోలను షేర్‌ చేశాను. అయితే ఇక్కడొక ప్రమాదం ఉంది. నా పేరును గార్బింద్రాగా మార్చేస్తారేమో. కానీ నా వాట్సాప్‌ వండర్‌ బాక్స్‌కు వచ్చే వీడియోలను షేర్‌ చేయకుండా ఉండలేను’ అని అందులో రాసుకొచ్చారు. ‘ఈ వీడియో న్యూయార్క్‌లో తీసింది. పెద్ద శబ్దాలతో వచ్చే నృత్యాలను ఆపడం కోసం నియమించిన పోలీసులు దానికి బదులుగా అక్కడి వారితో కలిసి డ్యాన్సులు చేస్తున్నారు’ అని ఆయన తెలిపారు. ఈ వీడియో షేర్ చేసిన కొద్దిసేపటికే అనేక మంది వీక్షించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com