తిత్లీ బాధితులకు సింగపూర్ తెదేపా సహాయం

శ్రీకాకుళం జిల్లా కి టిట్లి తుఫాన్ వల్ల జరిగిన నష్టానికి , ప్రజలు పడుతున్న కష్టాలను చూసి చలించిపోయిన తెలుగు దేశం ఫోరమ్ (సింగపూర్ ) కుటుంబసభ్యులు అంతా , మన శ్రీకాకుళ సోదరులకు వచ్చిన కష్టం తమ కష్టం గా బావించి, ప్రతి ఒక్కరు తమవంతు గా విరాళాలు ఇచ్చి , శ్రీకాకుళం జిల్లా ఈ నష్టం , కష్టాలలో నుంచి త్వరగా కోలుకోవాలి అని కోరుకున్నారు . తెలుగు దేశం ఫోరమ్ (సింగపూర్ ) సభ్యులు సేకరించిన నాలుగు లక్షల రూపాయలు కష్టాలలో ఉన్న సోదరుల అవసరాలు తీర్చే విధం గా దుప్పట్లు , తువాలు, లుంగీ పంచె , దోమ తెరలు ,ఓడోమోస్ క్రీం లను కలిపి ఒక ప్యాకెట్ గ చేసి శ్రీకాకుళం పరిధి లో పలాస నియోజక వర్గం లో సుమారు 25 గ్రామాలలో తెలుగు దేశం ఫోరమ్ ( సింగపూర్ ) సభ్యుల స్వహస్తాలతో పంచడం జరిగింది … కష్ట సమయంలో చేసిన సహాయం కు తుఫాన్ బాధిత సోదరులు ఎంతో సంతోషం ని వ్యక్త పరిచి , తెలుగు దేశం ఫోరమ్ (సింగపూర్ ) సభ్యులకు కృతజ్ఞతలు తెలియపరిచారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com