దక్షిణాఫ్రికాలో బతుకమ్మ వేడుకలు

దక్షిణాఫ్రికాలోని జోహెన్నస్బర్గ్, మిడ్ ర్యాండ్, కేప్టౌన్ తదితర ప్రాంతాల్లోని తెలంగాణ వాసులు బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సౌతాఫ్రికా(టీఏసీఏ) ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు కాన్సులేట్ జనరల్ డాక్టర్ కేజే శ్రీనివాస ముఖ్య అతిథిగా విచ్చేశారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల గురించి ఈ సందర్భంగా పలువురు గుర్తు చేసుకున్నారు.కార్యక్రమంలో టీఏసీఏ ఛైర్మన్ సుబ్బారావు, అధ్యక్షులు భూమయ్య, వ్యవస్థాపక సభ్యులు సురేష్ పడాల, శ్రీనివాస్ తాళ్లూరి, వెంకట రమణారెడ్డి, శ్రీనివాస్ వాసిరెడ్డి, అరవింద్ జయారపు, సీతారామరాజు, మురళి బండారు, వెంకట్ రెడ్డి, వీరన్న, రజనీ పడాల తదితరులతో పాటు పలువురు తెలంగాణ వాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి. ముఖ్యంగా ఎంఎల్ఏ రసమయి బాలకిషన్ బృందం ఆలపించిన పాటలు ఆకట్టుకున్నాయి. బతుకమ్మ వేడుకలను విజయవంతం చేయడంలో కీలకంగా వ్యవహరించిన శివ నాగులు, సంధ్య, పద్మావతి, ప్రవీణ్, రామనాథ్ తదితరులను టీఏసీఏ బృందం అభినందించింది. కార్యక్రమంలో టీఏసీఏ ఛైర్మన్‌ సుబ్బారావు, అధ్యక్షులు భూమయ్య, వ్యవస్థాపక సభ్యులు సురేష్‌ పడాల, శ్రీనివాస్‌ తాళ్లూరి, వెంకట రమణారెడ్డి, శ్రీనివాస్‌ వాసిరెడ్డి, అరవింద్‌ జయారపు, సీతారామరాజు, మురళి బండారు, వెంకట్‌ రెడ్డి, వీరన్న, రజనీ పడాల తదితరులతో పాటు పలువురు తెలంగాణ వాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి. ముఖ్యంగా ఎంఎల్‌ఏ రసమయి బాలకిషన్‌ బృందం ఆలపించిన పాటలు ఆకట్టుకున్నాయి. బతుకమ్మ వేడుకలను విజయవంతం చేయడంలో కీలకంగా వ్యవహరించిన శివ నాగులు, సంధ్య, పద్మావతి, ప్రవీణ్‌, రామనాథ్‌ తదితరులను టీఏసీఏ బృందం అభినందించింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com