శారీరక ఛాయను అనుసరించి ముద్దు పేర్లు పెట్టి పిలవడం తనకు నచ్చదని అంటోంది తమన్నా. అభిమానులంతా ఆమెను మిల్కీబ్యూటీ అని సంభోదిస్తుంటారు. అయితే ఆ పిలుపు తనకు సంతోషాన్ని ఇవ్వదని చెబుతోంది తమన్నా. ఆమె మాట్లాడుతూ ‘అభిమానులు మంచి ఉద్దేశంతోనే మిల్కీ బ్యూటీ అని నన్ను అంటోన్న ఆ పిలుపులో నాకు ఆనందం ఉండదు. శరీర వర్ణాన్ని బట్టి పేర్లు పెట్టడం తప్పు అని నా అభిప్రాయం. మనదేశంలో అందమైన చర్మం పట్ల అభిమానం,వ్యామోహం చాలా మందిలో కనిపిస్తోంది. కొన్నిసార్లు ఇలాంటి పేర్లు, ముద్రలు ఆత్మన్యూనతకు, వర్ణవివక్షకు దారితీస్తాయి. ప్రతిభాపాటవాలను అనుసరించి ముద్దు పేర్లు పెడితే బాగుంటుంది. అంతేకానీ చర్మ రంగును ఉద్దేశిస్తూ కాదు’ అని తెలిపింది. ఒకప్పుడు వెబ్‌సిరీస్‌ల పట్ల అగ్రనాయకానాయికల్లో చిన్నచూపు ఉండేదని, గత కొంతకాలంగా ఈ ధోరణిలో మార్పులు వస్తున్నాయని తెలిపింది. భవిష్యత్తులో మంచి వెబ్‌సిరీస్‌లలో భాగమయ్యేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పింది. ప్రస్తుతం ‘లెవెంత్ అవర్’ పేరుతో తమన్నా ఓ వెబ్‌సిరీస్ చేస్తోంది.
పాలతో నన్ను పోల్చవద్దు
Related tags :