నిరంతర అలసట?

కొంతమందిని ఎప్పుడు చూసినా నీరసంగా కనిపిస్తారు. దీనికి అనారోగ్యం, పౌష్టికాహార లోపం, పనిఒత్తిడి లాంటి చాలా కారణాలుండొచ్చు. అయితే రోజంతా బద్దకంగా, నీరసంగా గడపటం చికాకును కలిగిస్తుంది. ఈ సూచనలతో అలసటను అధిగమించవచ్చు.ఛి శరీరాన్ని ఫిట్గా, యాక్టివ్గా ఉంచటంలో ఆరోగ్యకరమైన ఆహారం పాత్ర చాలా ముఖ్యమైనది. కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలను తినకూడదు. పళ్లు ఎక్కువగా తినాలి.పని ఒత్తిడి ముంచెత్తకమునుపే మీకంటూ కొంత సమయం కేటాయించుకోవటం ముఖ్యం. రోజును త్వరగా ప్రారంభించటం వల్ల ఇది సాధ్యమవుతుంది. దాంతో యాక్టివ్గా, ఎనర్జిటిక్గా ఉంటారు. ఈ అలవాటు దీర్ఘకాలంలో మంచి ఫలితాన్నిస్తుంది. అందుకే త్వరగా నిద్రపోయి, త్వరగా నిద్రలేవటం అలవాటు చేసుకోవాలి.హాబీలకు పని చెప్పాలి. స్నేహితులతో కలసి వారాంతాల్లో ట్రెక్కింగ్కు వెళ్లటం, డ్యాన్స్ క్లాసుల్లో చేరటం వల్ల శారీరకంగా, మానసికంగా ఉత్తేజితులవుతారు.ఎలకా్ట్రనిక్ గ్యాడ్జెట్స్ విలువైన సమయాన్ని హరిస్తాయి. ఆఫీస్ వర్క్, ఇంటిపనులకు సమయం సరిపోక చాలామంది వ్యాయామానికి దూరమవుతున్నారు. తగినంత వ్యాయామం చేయటం వల్ల రోజంతా హుషారుగా ఉండి, పనులు త్వరగా పూర్తి చేయగలుగుతారు.పైన చెప్పిన పద్ధతులు పాటించినా కూడా నీరసం తగ్గకపోతే వైద్యుడిని సంప్రదించాలి. రక్తహీనత సాధారణంగా కనిపించే సమస్య. ఒకసారి హిమోగ్లోబిన్ టెస్ట్ చేయించుకోవాలి. వైద్యుడి సలహా మేరకు మందులు వాడాలి. లేదా ఇతర జబ్బులేమైనా ఉంటే తగిన చికిత్స తీసుకోవాలి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com