14న పెళ్లి

బాలీవుడ్‌ కథానాయిక దీపికా పదుకొణె తన పెళ్లి కబురును ఎట్టకేలకు వినిపించారు. రణ్‌వీర్‌ సింగ్‌తో తనకున్న ప్రేమ బంధం నవంబరు 14, 15వ తేదీల్లో వివాహ బంధంగా మారబోతోందని తెలిపారు. ఈ మేరకు ఆమె ట్విటర్‌లో ఓ ప్రకటనను షేర్‌ చేశారు. ‘కుటుంబ సభ్యుల ఆశీర్వాదాలతో నవంబరు 14, 15న మా పెళ్లి జరగబోతోందని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ఇన్నేళ్లు మీరు మాపై కురిపించిన ప్రేమకు ధన్యవాదాలు. ప్రేమ, స్నేహం, నమ్మకంతో మేం కలిసి చేయబోతున్న ఈ ప్రయాణానికి మీ అందరి ఆశీర్వాదాలు కావాలి.. ప్రేమతో మీ దీపిక, రణ్‌వీర్‌’ అని అందులో రాసి ఉంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com