న్యూజెర్సీ సాయి ఆలయానికి భూమిపూజ

అమెరికాలోని న్యూజెర్సీలో సాయి దత్త పీఠం ఆధ్వర్యంలో షిరిడీ సాయినాథుని ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. విజయదశమి, బాబావారి 100 సం. ల పుణ్య తిథి సందర్భంగా సాయిదత్త పీఠం నిర్వాహకులు రఘుశర్మ శంకరమంచి, వేద పండితుడు భైరవమూర్తి ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించారు. ఈ ఆలయ నిర్మాణం ఎంతో కళాత్మకంగా, మహారాష్ట్రలోని షిరిడీ ఆలయాన్ని ప్రతిబింబించేలా నిర్మించనున్నట్లు సాయిదత్తపీఠం ప్రతినిధులు వెల్లడించారు. గురుస్థానం, లెండివనం, ద్వారకామయి, నిత్య ధుని, చావడి తదితర వాటిని కూడా ఈ ఆలయంలో నిర్మించనున్నారు. పలువురు వాలంటీర్లు, ఇంజినీర్లు, ఆర్కిటెక్ట్స్‌, సాయి దత్త పీఠం బోర్డు డైరెక్టర్స్ ఈ భూమి పూజలో పాల్గొన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com