WorldWonders

ఆవుపేడతో రంగుల తయారీ

Cow And Uses - Indian Makes Paint Using Cow Dung - Calls Vedic Paint

ఆవు పెండ‌తో త‌యారైన పెయింట్‌ను గురువారం ప‌రిచ‌యం చేశారు కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ. దీనికి వేదిక్ పెయింట్ అని పేరు పెట్టారు. ట్విట‌ర్ ద్వారా ఆయ‌న ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. అతి త్వ‌ర‌లోనే ఈ వేదిక్ పెయింట్‌ను లాంచ్ చేయ‌నున్న‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు. గ్రామీణప్రాంత ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను మ‌రింత బ‌లోపేతం చేయ‌డానికి, రైతుల‌కు అద‌న‌పు ఆదాయం స‌మ‌కూర్చ‌డానికి అతి త్వ‌ర‌లోనే ఆవు పెండ‌తో త‌యారు చేసిన ఈ వేదిక్ పెయింట్‌ను లాంచ్ చేయ‌బోతున్నాం. ఖాదీ, గ్రామీణ ప‌రిశ్ర‌మ‌ల క‌మిష‌న్ ద్వారా ఈ పెయింట్ త‌యార‌వుతోంది అని గ‌డ్క‌రీ ట్వీట్ చేశారు. ఈ పెయింట్ డిస్టెంబ‌ర్‌, ఎమ‌ల్ష‌న్ రూపాల్లో అందుబాటులో ఉంటుంద‌ని, కేవ‌లం నాలుగు గంట‌ల్లో ఆరిపోతుంద‌ని చెప్పారు. పర్యావ‌ర‌ణ హిత‌మైన ఈ పెయింట్ విష ర‌హిత‌, యాంటీ బ్యాక్టీరియ‌ల్‌, యాంటీ ఫంగ‌ల్ ల‌క్ష‌ణాలు క‌లిగి ఉంటుంది. ఈ వేదిక్ పెయింట్ వ‌ల్ల గ్రామీణ ప్రాంతాల్లోని పాడి రైతులు అద‌నంగా ఏడాదికి రూ.55 వేలు సంపాదిస్తార‌ని గ‌డ్క‌రీ అంచ‌నా వేశారు.