సిమ్లా పేరు శ్యామలగా మారుస్తారా?

దేశంలోని ప్రఖ్యాత నగరాల పేరు మార్పు జాబితాలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పర్యాటక కేంద్రం సిమ్లా తాజాగా చేరింది. హిమాచల్ప్రదేశ్ రాజధాని సిమ్లా పేరు శ్యామలగా మార్చాలని ఆ రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం యోచిస్తున్నది. బ్రిటిష్ కాలంనాటి చిహ్నాలను తుడిచిపెట్టడంలో భాగంగా సిమ్లా పేరును మార్చాలన్న హిందూత్వ సంస్థల డిమాండ్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ప్రతిపాదనలను సిద్ధంచేయడంపాటు పార్టీ అనుబంధ సంఘాలతో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నది. ఈ ప్రతిపాదనను కొందరు ఆమోదిస్తుండగా, మరికొందరు తిరస్కరిస్తున్నారు. ఈ అంశంపై బీజేపీ నేత, ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖమంత్రి విపిన్సింగ్ పార్మర్ మాట్లాడుతూ దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న చారిత్రక నగరాల పేర్లను కూడా మార్చారని, ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదని అన్నారు. సిమ్లా పేరు ప్రజలు శ్యామలగా మార్చాలని కోరుకుంటే ఆ ప్రతిపాదనను ఆమోదిస్తామన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com