టాకో అధ్యక్షుడిగా ఎన్నికైన చలసాని జగన్నాద్

కొలంబస్ తెలుగు సంఘానికి (టాకో) జరిగిన ఆసక్తికరమైన త్రిముఖ పోటీల్లో అద్యక్షుడిగా చలసాని జగన్నాద్ ఎన్నికయ్యారు. టాకోలో మొత్తం 1800 ఓట్లు ఉండగా 1307 ఓట్లు పోలయ్యాయి. జగన్నాద్ కు 624 ఓట్లు రాగా ఆయన పై అద్యక్ష పదవికి పోటీ పడిన భరత్ కు 345 ఓట్లు , హనుమాన్ కు 311 ఓట్లు వచ్చాయి . 27 ఓట్లు చెల్లకుండా పోయాయి. జీవితకాల ట్రస్టీగా బోడేపూడి కోటేశ్వరరావు, జనరల్ ట్రస్టీగా లతా రేవూరు ఎన్నికయ్యారు. ఆదివారం నాడు దీపావళి సంబరాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం ఓట్ల లెక్కింపు జరిగింది. నూతనంగా ఎన్నికైన వారిని సభ్యులు అభినందించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com