గటగటా నీళ్లను గుటుక్కున మింగేస్తే చాలు.. కేర్ కేర్ మంటూ పిల్లలు పుట్టేస్తారు. షాక్ అవుతున్నారా?. పిల్లలు కావాలంటే గుడులు, గోపురాలు తిరగక్కర్లేదు. డాక్టర్లకు లక్షల లక్షలు పోయక్కర్లేదు. ఒక ఊరిలో ఓ బావి ఉంది. ఆ బావి మామూలు బావి కాదు. అందులో నీళ్లు మామూళ్లు అసలే కావు. పవర్ ఫుల్ నీళ్లవి. అవి తాగితే పిల్లలు, పైగా కవల పిల్లలు పుడతారట. ఆ బావిలోని నీళ్లు తాగిన అందిరికి కవలలేనట. అందుకే అక్కడికి వెళితే పైసా ఖర్చు లేకుండా నీళ్లు తీసుకుని తాగితే ఆ తర్వాత డబుల్ ధమాకా గ్యారంటీ అంటున్నారు. ఇది సైంటిఫిక్‌గా ఏమైనా ప్రూవ్ అయిందా అంటే లేదు. ఇది కేవలం నమ్మకం మాత్రమే సుమా. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం దొడ్డిగుంట కవలల గ్రామంగా ఫేమస్. ఆ ఊరిలోని బావి నీళ్లలో ఏదో ఉందని, అందుకే ఆ గ్రామంలో కవలలు ఎక్కువగా పుడుతున్నారనే ప్రచారం బాగా జరిగింది. ఏ ఇంటికి పోయినా మనకు చూడముచ్చటి కవలలు కనిపిస్తారు. ఈ ఊరు అసలకైతే మెట్టప్రాంతం. అయినా ఆ ఊరి బావిలో నీళ్లు ఎప్పుడూ ఉంటాయి. నీళ్లు తాగడానికి రుచికరంగా కూడా ఉంటాయట. ఊరి చివర ఉన్నా సరే అక్కడి నుంచే నీరు తెచ్చుకుని తాగు నీటిగా వాడుకుంటుంటారు ఆ గ్రామస్తులు.
దొడ్డిగుంట బావి నీళ్లు తాగితే కవలలు ఖాయం
Related tags :