NRI-NRT

హైదరాబాద్ వరద బాధితులకు TDF సాయం

TDF Helps Hyderabad Flood Victims In Firjadiguda

హైదారాబాద్ వరద బాధితులకు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (TDF) సహాయం

అక్టోబర్ లో కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన నిరుపేద కుటుంబాలను ఆదుకోవడానికి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (TDF) ముందుకు వచ్చింది.

ఫీర్జాదిగూడ మునిసిపల్ కార్పొరేషన్ 8వ వార్డ్ పరిధిలోని శ్రీశ్రీనగర్ హుడా పార్క్ లో వరద బాధితులను కలిసి వారి క్షేమ సమాచారాలు తెలుసుకొని, వారికి నిత్యావసర వస్తువులు మరియు బ్లాంకెట్ లు అందజేయడం జరిగింది.

టీడిఎఫ్ (USA) ప్రెసిడెంట్ చల్లా కవిత అధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్, పీర్జాది గూడ మేయర్ జక్క వెంకట్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ లేతాకుల మాధవి, టీడీఎఫ్ ఇండియా అధ్యక్షులు వట్టే రాజారెడ్డి, ప్రధాన కార్యదర్శి మట్ట రాజేశ్వర్, ఉపాధ్యక్షులు కరకాల కృష్ణా రెడ్డి, మాజీ అధ్యక్షులు నరేందర్ మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ అన్నారు. TDF సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ఇది రెండవసారి అని, ఇంతకు ముందు లాక్ డౌన్ సమయంలో tdf చేసిన సేవా కార్యక్రమాలను గుర్తించి ” గుడ్ సామరిటన్” అవార్డును రాచకొండ కమిషనరేట్ తరపున TDF కు ఇచ్చిన సంగతి ఆయన గుర్తు చేసుకున్నారు.

తెలంగాణ సమాజానికి ఎంతో సేవ చేస్తున్న TDF సంస్థకు తన సహాయ సహకారాలు ఉంటాయని ఆయన అన్నారు. తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా TDF చేస్తున్న అనేక కార్యక్రమాల గురించి ప్రెసిడెంట్ చల్లా కవిత వివరించారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులకు, స్థానిక ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలియ చేసారు. TDF చేస్తున్న సేవా కార్యక్రమాలకు తోడ్పడుతున్న TDF (USA ) సంస్థ సభ్యులకు, శ్రేయోభిలాషులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.
హైదరాబాద్ వరద బాధితులకు TDF సాయం